జాన్వీ సొగసు చూస్తే... గుండె ‘దఢక్... దఢక్’

news18india
Updated: June 7, 2018, 12:19 PM IST
జాన్వీ సొగసు చూస్తే... గుండె ‘దఢక్... దఢక్’
జాన్వీ కపూర్
  • Share this:
అతిలోక సుందరి శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్... త్వరలో ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్లో తెరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. కూతురిని తెరమీద హీరోయిన్ గా చూడాలనుకున్న కోరిక తీరకుండానే అర్ధాంతరంగా దివి నుంచి దివికేగింది శ్రీదేవి. ఆమె ఆకస్మిక మరణంతో యావత్ భారతదేశం తీవ్ర దిగ్భాంతికి గురైంది. అయితే శ్రీదేవి లేని లోటు ఆమె కూతురే తీర్చేలా కనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన తొలి ఫోటో షూట్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

వోగ్ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఓ ఫోటోషూట్ చేసింది జాన్వీ. హీరోయిన్ గా ఇంకా ఒక్క సినిమా కూడా పూర్తి చేయకముందే ‘వోగ్’ లాంటి పాపులర్ పత్రిక కవర్ పేజీ మీద ఎక్కిన ఘనత శ్రీదేవి కూతురికే దక్కుతుంది. కొన్ని రోజుల క్రితం విడుదలయిన ఈ మ్యాగజైన్ కవర్ ఫోటోలను చూసిన వారందరికీ అతిలోక సుందరి శ్రీదేవియే కళ్లముందు కనిపించింది. అచ్ఛం అమ్మలా కళ్ళతో కట్టపడేసి, తెలియని మత్తులో ముంచేసింది జాన్వీ. తాజాగా ఈ ఫోటో షూట్ ఎలా జరిగిందో వివరిస్తూ కొన్ని వీడియోలను విడుదల చేశారు.నిజానికి జాన్వీ కపూర్ కి ఇది మొట్టమొదటి ఫోటో షూట్. అయినా ఏ మాత్రం బిడియం, భయం ఆమె ముఖంలో ఎక్కడా కనిపించలేదు. పూర్తి కాన్ఫిడెంట్ గా నవ్వుతూ, కవ్విస్తూ ఫుల్ జోష్ తో ఫోటో షూట్ పూర్తి చేసింది జాన్వీ. వయ్యారాలను చూపించి, చూపించకుండా ఎలా కైపులో పడేయాలో కూడా త్వరగానే నేర్చుకుంది ఈ 21 ఏళ్ల కుర్రది. అమ్మడి గ్లామర్ ప్రదర్శనకి ఫ్యాషన్ ప్రపంచం అవాక్కవుతోంది. తల్లి శ్రీదేవి ఉన్నప్పుడే అన్ని విషయాలను నేర్పిందో, లేక అమ్మ సినిమాలను చూస్తూ పెరిగింది కాబట్టే అప్పుడే నేర్చుకుందో తెలీదు కానీ కొత్తమ్మాయిలా మాత్రం అనిపించడం లేదు జాన్వీని చూస్తుంటే. ఈ వీడియోలో జాన్వీ కపూర్ వయ్యారాలను, నవ్వుల సింగారాలను చూసి ఇప్పటికే ఆమె అభిమానులుగా మారిపోయారు చాలా మంది.అలనాటి అందాల తార శ్రీదేవి వెండితెర మీద కనిపిస్తే, అప్పటి తరం గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. ఆమె అందాన్ని చూసేందుకే చాలామంది సినిమా థియేటర్లకి వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. తరం మారింది. శ్రీదేవి శకం ముగిసింది. ఇప్పుడు జాన్వి శకం మొదలుకానుంది. ‘దఢక్’ సినిమా విడుదలయ్యాక శ్రీదేవి తనయ జాన్వి నేటి కుర్రాళ్ల గుండెల్లో ఆరాధ్య దేవతగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘సైరత్’ సినిమా ఆధారంగా ‘దఢక్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ సరసన షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్నాడు.
Published by: Ramu Chinthakindhi
First published: June 7, 2018, 12:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading