చిలక పచ్చ డ్రెస్‌లో మెరిసిన జాన్వీ కపూర్... ఫ్యాన్స్ ఫిదా...

శ్రీదేవీ కూతురైన జాన్వీ కపూర్... ఎప్పుడు చూసినా ఎక్స్‌పోజింగ్ డ్రెస్సుల్లోనే కనిపిస్తుంది. ఆ పొట్టి డ్రెస్సుల్లో ఆమెను చూసీ చూసీ విరక్తి చెందిన ఫ్యాన్స్... ఇప్పుడు నిండైన డ్రెస్సులో చూసి హ్యాపీగా ఫీలవుతున్నారా?

news18-telugu
Updated: January 18, 2020, 12:45 PM IST
చిలక పచ్చ డ్రెస్‌లో మెరిసిన జాన్వీ కపూర్... ఫ్యాన్స్ ఫిదా...
చిలక పచ్చ సల్వార్‌ కమీజ్‌లో జాన్వీ కపూర్... ఫ్యాన్స్ ఫిదా... (credit - insta - pinkvilla)
  • Share this:
బాలీవుడ్‌లో సెలబ్రిటీల పిల్లలకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా అతిలోక సుందరి శ్రీదేవీ కూతురిగా జాన్వీ కపూర్‌కి ఎంతో గుర్తింపు ఉంది. కానీ ఏం లాభం... 2018లో ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ ప్లాపే అవుతున్నాయి. అయినప్పటికీ... వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై అంతగా ఆకట్టుకోలేకపోతున్న జాన్వీ... సోషల్ మీడియాలో పొట్టి డ్రెస్సులతో కుర్రకారును వెంట తిప్పుకుంటూనే ఉంది. రోజూ ఆమె ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యాషనిస్టాస్ కూడా... జాన్వీని బాగానే వాడుకుంటున్నారు. తమ తమ క్రియేటివ్ కాస్ట్యూమ్స్‌కి జాన్వీతో యాడ్స్ చేయించుకుంటూ... ఆమెను యూత్ స్టైల్ ఐకాన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ 22 ఏళ్ల బ్రీజీ గ్రీన్ యాంకిల్ లెంగ్త్ అనార్కలీ సల్వార్ కమీజ్‌లో తళుక్కుమంది. సిగరెట్టే పాంట్స్‌కి తోడు... పువ్వుల దుపట్టాతో మెరిసింది. సింపుల్‌గా కనిపిస్తున్న ఈ లుక్‌లో జాన్వీ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. 

View this post on Instagram
 

Janhvi Kapoor opts for a traditional printed outfit post her pilates session today😍❤ @pinkvilla . . . . #janhvikapoor #celebs #celebrities #stars #actor #actress #style #fashion #traditional #printed #pilates #pinkvilla


A post shared by Pinkvilla (@pinkvilla) on

ఈ ఏడాది జాన్వీ... దెయ్యం కథలను ఎంచుకుంది. గుంజన్ సక్సేనా-ది కార్గిల్ గర్ల్, దోస్తానా 2 సినిమాలు క్యూలో ఉన్నాయి. కరణ్ జోహార్‌తో తక్త్ అనే మరో ప్రాజెక్ట్ కూడా చేస్తోంది.


First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు