హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss: భావోద్వేగంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన జెస్సీ.. గేట్ వద్దే కూలబడిన షణ్ముఖ్, సిరి.. కన్నీరు పెట్టించిన ప్రోమో..

Bigg Boss: భావోద్వేగంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన జెస్సీ.. గేట్ వద్దే కూలబడిన షణ్ముఖ్, సిరి.. కన్నీరు పెట్టించిన ప్రోమో..

కన్నీళ్లు పెట్టుకున్న జెస్సీ (Image : Youtube)

కన్నీళ్లు పెట్టుకున్న జెస్సీ (Image : Youtube)

Bigg Boss: తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 5. ఈ రియాలిటీ షో ప్రస్తుతం 10వ వారంలోకి అడుగుపెట్టింది. ప్రతీ ఒక్కరూ తమదైన శైలిలో ఆటల్లో ఇచ్చి పడేస్తున్నారు. తగ్గేదేలే అన్నట్లు ఆట ఆడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియలో కూడా అదే విధంగా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు.

ఇంకా చదవండి ...

తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 5. ఈ రియాలిటీ షో ప్రస్తుతం 10వ వారంలోకి అడుగుపెట్టింది. ప్రతీ ఒక్కరూ తమదైన శైలిలో ఆటల్లో ఇచ్చి పడేస్తున్నారు. తగ్గేదేలే అన్నట్లు ఆట ఆడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియలో కూడా అదే విధంగా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇక్కడ జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ గురించి చెప్పుకోవాలి. మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన జెస్సీ ఎన్నో అవార్డులను సాధించి  తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ షోకి వచ్చి ఇక్కడ కూడా ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఓ వారం కెప్టెన్ కూడా అయ్యాడు.

Bigg Boss Telugu 5: బిగ్ బ్రేకింగ్.. హౌస్ నుంచి జెస్సీని పంపించేసిన బిగ్ బాస్.. కారణం ఏంటంటే..


అయితే తాజాగా బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమో జెస్సీ ఆరోగ్య రీత్యా ఇంటి నుంచి బయటకు పంపించేశారు. అతడి ఆరోగ్యం గత రెండు వారాల నుంచి సరిగ్గా ఉండటం లేదు. దీని కారణంగానే అతడు బయటకు రావాల్సి వచ్చింది. అతడు వర్టిగో సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ సమస్య ఉన్నవాళ్లకు కంటిచూపు మందగించడం..చెవులు సరిగ్గా వినిపించక పోవడం..అలాగే ఎక్కువ సేపు నిలబడిన కూడా శరీరం అసౌకర్యంగా ఉండటం లాంటి లక్షణాలు ఉంటాయి. గత 15 రోజులుగా ఈ సమస్యతో అతడు బాధ పడుతున్నాడు. అతడిని డాక్టర్లు పరీక్షిస్తూ వస్తున్నారు. అయితే చివరకు అతడికి రెస్ట్ అవసరం అని డాక్టర్లు చెప్పడంతో బయటకు వెళ్లక తప్పలేదు.' isDesktop="true" id="1079364" youtubeid="tAibYTk1uQU" category="movies">

అయితే అతడిని ఇంటికి పంపించేస్తారా.. లేదా సీక్రెట్ రూంలో ఉంచి వైద్యం అందిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ప్రోమోలో పవర్ రూంలో కి జెస్సీని పిలిచిన బిగ్ బాస్ .. ఆరోగ్యం సరిగ్గా లేదని అనిపిస్తుంది.. మీరు మెయిన్ గేట్ నుంచి బయటకు రండి అంటూ చెబుతాడు. అతడు భావోద్వేగానికి గురై పవర్ రూంనుంచి బయటకు వచ్చి.. నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను అంటూ చెబుతాడు. అతడి కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. ప్రతీ ఒక్కరూ బాధపడ్డారు. అతడికి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన షణ్ముఖ్, సిరి అయితే వాళ్ల కన్నీటిని ఆపుకోలేక పోయారు.

Bigg Boss Telugu 5: ఈ వారం నామినేషన్లో ఉన్న సభ్యులు వీళ్లే..! డేంజర్ జోన్లో ఆ కంటెస్టెంట్..


అతడు గేట్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా గేట్ వద్దనే కూర్చొని విపరీతంగా బాధపడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోతే ఇలానే ఉంటుందని.. ఆ బాధ వర్ణాణాతీతం అంటూ చెప్పుకొస్తున్నారు. ఆ ప్రోమో చూసిన వాళ్లకు కూడా ఎంతో బాధ కలిగించింది. ఏదేమైనా బిగ్ బాస్ విడుదల చేసిన ఈ ప్రోమో భావోద్వేగంగా ఉండి.. అందరినీ కన్నీళ్లు పెట్టించింది.

First published:

Tags: Bigg boss 5 buzz, Bigg Boss 5 Telugu, Bigg boss 5 telugu manaas, Jessie

ఉత్తమ కథలు