JESSI SAYS SORRY TO ANNE MASTER IN LATEST BIGG BOSS SEASON 5 TELUGU EPISODE NR
Bigg Boss 5 Telugu: అనీ మాస్టర్ కాళ్లు పట్టుకున్న జెస్సీ.. నోటి దూల మాములుగా లేదంటూ ట్రోల్?
Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో తొలి రోజుల్లోనే రచ్చ మొదలయింది. మొత్తానికి గ్రూపులుగా ఉండటం హౌస్ మెట్స్ తో గొడవలకు దిగడం అంత ఓ రేంజ్ లో సాగుతుంది. పూర్తి పరిచయాలు కూడా పెరగనేలేదు అంతలోనే శత్రువులు అవుతున్నారు కంటెస్టెంట్ లు.
Bigg Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో తొలి రోజుల్లోనే రచ్చ మొదలయింది. మొత్తానికి గ్రూపులుగా ఉండటం హౌస్ మెట్స్ తో గొడవలకు దిగడం అంత ఓ రేంజ్ లో సాగుతుంది. పూర్తి పరిచయాలు కూడా పెరగనేలేదు అంతలోనే శత్రువులు అవుతున్నారు కంటెస్టెంట్ లు. ఇదిలా ఉంటే తాజాగా అనీ మాస్టర్ కాళ్లు పట్టుకున్నాడు జెస్సీ.
మొత్తానికి బుధవారం రోజు ప్రసారమైన ఎపిసోడ్ బాగా హైలెట్ గా మారింది. సైలెంట్ గా ఉండే జెస్సీ వైలెంట్ అయ్యాడు. దీంతో ఈ ప్రోమోని చూసిన వాళ్లంతా జెస్సీని అమాయకుడని అనుకున్నాం కానీ అసలు రూపం ఏంటో బయటపడింది అంటూ నెట్టింట్లో తెగ కామెంట్లు చేశారు. మొత్తానికి జెస్సీ అసలు క్యారెక్టర్ బయట పడేసరికి బాగా ట్రోల్స్ కూడా వచ్చాయి. జెస్సీ కుర్చీలో కాలు అడ్డు పెట్టడంతో ఆనీ మాస్టర్ వచ్చి కాలు తీయమని అనడం.. జెస్సీ ఆనీ మాస్టర్ మాటలను పట్టించుకోకుండా ఓవర్ గా చేయడంతో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది.
అక్కడున్నవారంతా వారిద్దరినీ కాంప్రమైజ్ చేశారు. మొత్తానికి ఇద్దరి మధ్య గట్టి వాదనలు జరగడంతో.. ఆనీ మాస్టర్ అక్కడ నుంచి వెళ్లి తన బెడ్ పై కూర్చొని బాగా ఎమోషనల్ అయ్యింది. ఇక కాసేపు తర్వాత జెస్సీ ఆనీ మాస్టర్ దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరాడు. అంతేకాకుండా ఆమె కాళ్ళు కూడా పట్టుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఉన్న గొడవ పూర్తిగా సద్దుమణిగింది.
ఇక ఈ సీన్ ను చూసిన నెటిజన్లు మాత్రం జెస్సీపై తెగ కామెంట్లు, ట్రోల్స్ చేశారు. మళ్లీ తనపై ప్రేక్షకులనుండి నెగటివ్ వస్తుందేమో అని వెంటనే తన తప్పును తెలుసుకొని క్షమాపణలు కోరాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు నోటి దూల మామూలుగా లేదు కదా అంటూ బాగా ట్రోల్స్ చేశారు. మొత్తానికి ఈ గొడవ జెస్సీ తోనే రావడంతో మళ్లీ జెస్సీనే క్షమాపణలు కోరాడు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.