ప్రస్తుతం నాని..గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమా చేసాడు.ఈ సినిమాలో నాని రంజీ క్రికెటర్ పాత్రలో నటించాడు. పైగా అప్ కమింగ్ దర్శకున్ని నమ్మి రెండు భారీ ఫ్లాపుల తర్వాత నాని చేస్తున్న సినిమా ఇది. అన్నింటికీ మించి క్రికెట్ నేపథ్యంలో వస్తుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను భారత క్రికెట్‌లో సంచలనాలు సృష్టించిన రంజీ క్రికెటర్ రమన్ లాంబా జీవితం ఆధారంగా తెరకెక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎవరూ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కానీ టీజర్.. ఈ చిత్ర కథను బట్టి చూస్తుంటే మాత్రం కచ్చితంగా ఇది రమన్ లాంబా జీవితమే అని ప్రచారం జరుగుతుంది. 80-90వ దశకంలో ఇండియన్ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగాడు రమన్ లాంబ.
శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈసినిమాను ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాబ్ శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ‘ఎఫ్ 2’ తో 2019లో సంచలన విజయం సాధించిన విక్టరీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jersey movie review, Nani, Telugu Cinema, Tollywood, Venkatesh