హోమ్ /వార్తలు /సినిమా /

Jersey Trailer Talk : హిందీ ‘జెర్సీ’ మూవీ ట్రైలర్ విడుదల.. క్రికెటర్ పాత్రలో అదరగొట్టిన షాహిద్ కపూర్..

Jersey Trailer Talk : హిందీ ‘జెర్సీ’ మూవీ ట్రైలర్ విడుదల.. క్రికెటర్ పాత్రలో అదరగొట్టిన షాహిద్ కపూర్..

’జెర్సీ’ సహా షాహిద్ కపూర్ సహా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమాలు (Twitter/Photo)

’జెర్సీ’ సహా షాహిద్ కపూర్ సహా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమాలు (Twitter/Photo)

Jersey Trailer Talk : Jersey Trailer Talk : ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌‌లో కథల కొరత ఉంది. దీంతో ఏదైనా భాషలో సినిమా హిట్టైయితే.. వెంటనే ఆయా సినిమాలను వేరే భాషల వాళ్లు రీమేక్ చేయాడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. తాజాగా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ మూవీని ట్రైలర్ విడుదల చేశారు.

ఇంకా చదవండి ...

Jersey Trailer Talk : ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌‌లో కథల కొరత ఉంది. దీంతో ఏదైనా భాషలో సినిమా హిట్టైయితే.. వెంటనే ఆయా సినిమాలను వేరే భాషల వాళ్లు రీమేక్ చేయాడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలో హిట్టైన చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ కోవలో తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ (Jersey)మూవీని హిందీలో షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా ‘జెర్సీ’ మూవీని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ కూడా నాని.. ‘జెర్సీ’ సినిమా వలే ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ క్రికెటర్ పాత్రలో అదరగొట్టారు.

షాహిద్ కపూర్.. విషయానికొస్తే.. ఈయన తెలుగులో హిట్టైన  ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ‘అర్జున్ రెడ్డి’  విజయ్‌ దేవరకొండను స్టార్‌ హీరోని చేసిన సినిమా ఇది. ఈ సినిమాను డైరెక్ట్‌ చేసిన సందీప్ వంగా పేరు దేశం యావత్తు మారుమోగింది.  రా లవ్‌స్టోరిని సందీప్‌ వంగా తెరకెక్కించిన తీరుకి అందరూ హ్యాట్సాఫ్‌ చెప్పారు.

దీంతో బాలీవుడ్‌ మేకర్స్‌ అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని హిందీలో సందీప్‌ వంగాతోనే కబీర్‌ సింగ్‌గా రీమేక్‌ చేశారు. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి ఆ ఏడాది బెస్ట్‌ హిట్‌ మూవీగా నిలిచింది. ఇప్పుడు సందీప్ వంగా బాలీవుడ్‌లోనే తన రెండో సినిమా 'యానిమల్‌'ను రణ్‌భీర్ కపూర్‌తో డైరెక్ట్‌ చేస్తున్నారు.

Naga Chaitanya - ANR : అక్కినేని నాగేశ్వరరావు, నాగ చైతన్య సహా సినీ ఇండస్ట్రీ తాత మనవళ్లు..

ఇక అర్జున్ రెడ్డి డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగాతో ‘కబీర్ సింగ్’ సినిమా చేసిన షాహిద్ కపూర్.. ఇపుడు తెలుగులో నాని హీరోగా ‘జెర్సీ’ మూవీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరితోనే హిందీలో జెర్సీ’ సినిమాను చేసారు. ఈ చిత్రాన్ని  జెర్సీ మూవీని తెలుగులో నిర్మించిన నాగ వంశీ, దిల్ రాజు, అల్లు అరవింద్‌తో పాటు అమన్ గిల్‌తో కలిసి  నిర్మించారు. ఇక తెలుగులో సత్యరాజ్ చేసిన పాత్రలను హిందీలో షాహిద్ కపూర్.. వాళ్ల నాన్న పంకజ్ కపూర్ చేయడం విశేషం. వీళ్లిద్దరు తొలిసారి స్క్రీన్ పై ‘జెర్సీ’ సినిమాలో కనిపించనుండటం విశేషం. ఇక హిందీలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ చేసింది.

Chiranjeevi - Naga Babu : చిరంజీవి హీరోగా నాగ బాబు నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలు ఏమిటో తెలుసా..

‘జెర్స’ మూవీ  తెలుగులో హీరో నానిని సరికొత్త కోణంలో ప్రెజెంట్‌ చేసిన సినిమా. హిందీలో షాహిద్‌ను కొత్తగా చూపిస్తుందడంలో డౌట్ లేదు.  గౌతమ్‌ తిన్ననూరి విషయానికొస్తే.. ఈయన ‘మళ్లీరావా’ అనే ఒకే ఒక సినిమాతో డైరెక్టర్‌గా మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత నానితో చేసిన ‘జెర్సీ’ మూవీ మంచి విజయాన్నేఅందుకున్నారు.

Tollywood Nephews : వెంకటేష్, నాగ చైతన్య సహా టాలీవుడ్ మామ మేనల్లుళ్లు ఇంకెవరున్నారంటే..


కథపై నమ్మకంతో ఉద్వాసనకు గురైన ఓ ఉద్యోగి, ముప్పై ఆరేళ్ల క్రికెటర్‌ కొడుకు కోసం క్రికెట్‌ ఆడాలనుకోవడమే కథాంశం. క్రికెట్‌ ఆడితే ప్రాణాలు పోతాయని తెలిసినా కొడుకు కోసం క్రికెట్‌ ఆడటమే సినిమాలో ట్విస్ట్‌. తెలుగులో నానికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రమిది. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది.

Malluwood Heroes In Tollywood : మోహన్‌లాల్,మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ సహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ హీరోలు..

‘జెర్సీ’  సినిమా సక్సెస్‌ గౌతమ్‌ తిన్ననూరిని బాలీవుడ్‌లో దర్శకుడిగా మార్చేసింది. ఈ సినిమాను డిసెంబర్ 31న విడుదల చేస్తున్నారు. మరి తెలుగు ప్రేక్షకులను కంటతడి పెట్టించిన ‘జెర్సీ’  సినిమాతో షాహిద్ కపూర్‌కు బాలీవుడ్‌లో మరో విజయం అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

First published:

Tags: Bollywood news, Jersey, Shahid Kapoor

ఉత్తమ కథలు