Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: September 21, 2019, 9:24 AM IST
మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో తళుక్కుమన్న జెన్నీఫర్ లోపెజ్... (Credit - Insta - jlo)
బ్యూటీ క్వీన్ జెన్నీఫర్ లోపెజ్ మరోసారి ఇంటర్నెట్ను షేక్ చేసింది. గ్రీన్ జంగిల్ ప్రింట్ వెర్సేస్ గౌన్‌లో దుమ్మురేపింది. ఎప్పుడో 2000 సంవత్సరంలో గ్రామీ అవార్డ్స్ అప్పుడు అలాంటి డ్రెస్ వేసుకుంది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఆమె గూగుల్ ఇమేజెస్‌లో టాప్ పొజిషన్స్‌లో నిలిచింది. తాజాగా మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో అప్పటి డ్రెస్ లాంటి వెర్షన్ డ్రెస్‌తో తళుక్కుమంది. ర్యాంప్‌పై ఆమె క్యాట్ వాక్ చేస్తూ వస్తుంటే... స్టన్ అయిపోవడం ఫ్యాన్స్ వంతైంది. వెర్సేస్ 2020 స్ప్రింగ్ కలెక్షన్లకు కొత్త అందాన్నిచ్చింది జెన్నీ. షార్ట్ స్లీవ్స్, కట్ ఔట్స్‌తో వచ్చిన కొత్త వెర్షన్లో... 50 ఏళ్ల వయసులోనూ... మెరిసిపోతూ హార్ట్స్ కొల్లగొట్టింది ఈ భామ.
రన్‌వే సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత... లోపెజ్... డిజైనర్ డోనాటెల్లా వెర్సేస్తో కలిసి మరోసారి తళుక్కుమంది. జెన్నీతో కలిసి నడవడం ఎంతో గొప్ప విషయం అని మెచ్చుకున్నారు వెర్సేస్.
మనం వేసుకోవడానికి ఎన్నో డ్రెస్సులు ఉన్నాయన్న జెన్నీ... 20 ఏళ్ల కిందట... తాను గ్రామీ అవార్డ్స్ రోజున వేసుకోవడానికి రెండు డ్రెస్సుల్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఒకటి వైట్ డ్రెస్ కాగా...రెండోది వెర్సేస్ జంగిల్ ప్రింట్ డ్రెస్ అని వివరించింది. అప్పట్లో స్టైలిస్టులు చెప్పిన సలహాతో... తను గ్రీన్ గౌన్ వేసుకున్నాననీ... అది కాస్తా ఫ్యాషన్ ఇండస్ట్రీలో హిస్టరీ క్రియేట్ చేయడం ఇప్పటికీ మర్చిపోలేనని తెలిపింది జెన్నీ.
View this post on Instagram
🌴💚
A post shared by Jennifer Lopez (@jlo) on
Published by:
Krishna Kumar N
First published:
September 21, 2019, 9:24 AM IST