HOME »NEWS »MOVIE »jennifer lopez goes nude for in the morning music video was special treat for fans hsn

Jennifer Lopez: పాటలో నగ్నంగా నటించిన జెన్నిఫర్ లోఫెజ్.. అభిమానులకు స్పెషల్ ట్రీట్

Jennifer Lopez: పాటలో నగ్నంగా నటించిన జెన్నిఫర్ లోఫెజ్.. అభిమానులకు స్పెషల్ ట్రీట్
’ఇన్ ద మార్నింగ్‘ లో నగ్నంగా నటించిన జెన్నిఫర్ లోఫెజ్

’ఇన్ ద మార్నింగ్‘ పేరుతో వచ్చే ఈ పాటకు సంబంధించిన వివరాలను గతేడాది నవంబర్ లోనే జెన్నీఫర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఓ న్యూడ్ కవర్ ఫొటోను అప్పట్లోనే విడుదల చేసి ఫ్యాన్స్ ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. తాజాగా శనివారం దానికి సంబంధించిన పూర్తి నిడివి ఉన్న వీడియో సాంగ్ విడుదలయింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  • Share this:
    జెన్నిఫర్ లోఫెజ్.. కుర్రకారుకు ఈ పేరు తెలియకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. యూత్ గుండెల్లో గునపాలు దించేలా హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచే ఈ అమెరికన్ బ్యూటీ తాజాగా మరో సాహస కృత్యాన్ని చేసింది. సినిమాల్లో శృతిమించి చేసే ఎక్స్ పోజింగ్ కే అభిమానులు మత్తెక్కిపోతారు. అలాంటిది జెన్నీఫర్ నగ్నంగా ఓ పాటలో ఆడిపాడింది. ’ఇన్ ద మార్నింగ్‘ పేరుతో వచ్చే ఈ పాటకు సంబంధించిన వివరాలను గతేడాది నవంబర్ లోనే జెన్నీఫర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఓ న్యూడ్ కవర్ ఫొటోను అప్పట్లోనే విడుదల చేసి ఫ్యాన్స్ ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. తాజాగా శనివారం దానికి సంబంధించిన పూర్తి నిడివి ఉన్న వీడియో సాంగ్ విడుదలయింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    అయితే ఈ పాట రిలీజ్ కు సంబంధించి మూడ్రోజుల క్రితమే జెన్నీ తన సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రోమో వీడియోతో పాటు ఓ పోస్ట్ ను పెట్టింది. ’నన్ను నేను ఇష్టపడుతున్నదాని కంటే మిన్నగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇన్ ద మార్నింగ్ అఫిషియల్ వీడియోను మీకు అందించడానికి నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. డార్క్ సైడ్ రిలేషన్ షిప్స్ గురించి ఈ పాట ఉంటుంది. నువ్వు ఎవరినీ మార్చలేవు, నిన్ను నువ్వే మార్చుకోవాలి. నీకు నచ్చిన దాని కంటే విలువైనది కాని దాన్ని వదిలేసి రెక్కలు వికసించుకున్న పక్షిలా ఎగిరిపోవాలి..‘ అంటూ జెన్నీఫర్ తన సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టింది. దీంతోపాటు 59 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియోను కూడా జోడించింది. పూర్తి వీడియో జనవరి 16న విడుదల అయింది.





    మొత్తానికి జెన్నీ న్యూడ్ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఫిజిక్ గురించి నెట్టింట హాట్ హాట్ టాపిక్ జరుగుతోంది. 51 ఏళ్ల వయసులో కూడా ఇంత ఫిట్ నెస్ ఎలా సాధ్యం అంటూ ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముందుగా పొటోను వదిలి క్యూరియాసిటీని క్రియేట్ చేశారనీ, ఎట్టకేలకు వీడియోను అందించారంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా, జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జెన్నీఫర్ స్పెషల్ పర్ఫామెన్స్ కూడా ఉండబోతుండటం గమనార్హం.
    Published by:Hasaan Kandula
    First published:January 17, 2021, 20:04 IST