సీనియర్ హీరో రాజశేఖర్ కొత్త సినిమా 'శేఖర్' (Shekar)ప్రమోషన్స్‌లో భాగంగా జీవిత (Jeevitha Rajasekhar ) చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకు తావిచ్చాయి. ఆమె చేసిన కామెంట్స్ తమ కులాన్ని కించపరిచినట్లుగా ఉన్నాయంటూ ఆర్య వైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాజాగా మరో ప్రెస్ మీట్ పెట్టి తనను క్షమించమని కోరుతూ తాను చేసిన కామెంట్స్‌పై పూర్తి వివరణ ఇచ్చారు జీవిత. జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar ) కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారని యాంకర్ వేసిన ప్రశ్నపై జీవిత స్పందించిన తీరు వివాదాలకు కారణమైంది. తన కూతురు శివానీ పేరు స్విగ్గీ అని, డబ్బుల విషయంలో దానివి కోమటిదాని లెక్కలని జీవిత వ్యాఖ్యానించడంతో ఆర్య వైశ్యులు హర్ట్ అయ్యారు. తమ సామాజిక వర్గానికి పిరికితనాన్ని ఆపాదించేలా జీవిత చేసిన కామెంట్స్ బాధించాయని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా ప్రెస్ మీట్‌లో ఈ కామెంట్స్‌పై మరోసారి రియాక్ట్ అయ్యారు జీవిత. కోమట్లు (ఆర్య వైశ్యులు) (Arya, Vaishyas)పైసాకు చాలా విలువ ఇస్తారని, డబ్బును పద్దతిగా ఖర్చు పెడుతుంటారని, అలాగే సంపాదనలో కొంత మొత్తాన్ని దానధర్మాలు చేస్తారని, అది వారిలో ఉన్న గొప్ప క్వాలిటీ అని పేర్కొన్న జీవిత.. చిన్నప్పటి నుంచి కోమటిలెక్క అనే మాట విని విని మాటల్లో మాలులుగా మా శివానీ కోమట్ల లెక్క అనే పదం తన నోట వచ్చిందని అన్నారు. అయితే తాను వేరే ఉద్దేశ్యంతో ఆ మాట అనలేదని, తనకు ఆర్య వైశ్యులంటే చాలా గౌరవం అని చెప్పారు. ఆర్య వైశ్యులను కించపరిచేందుకు మాత్రం కాదని పేర్కొన్నారు.
సినిమా రిలీజ్ టెన్షన్‌లో తానుంటే టీవీలో కొందరు జీవిత క్షమాపణలు చెప్పాల్సిందే అనే వాయిస్ విని వెంటనే సారీ చెప్పేందుకు రెడీ అయ్యానని జీవిత అన్నారు. తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆమె కోరారు. మా సినిమా ఇండస్ట్రీలో అందరం ఒకటే అని, అన్ని కులాలు, మతాలు ఒక్కటే అని చెప్పారు. తన స్కూల్ సర్టిఫికెట్స్, తన కూతుళ్ళ సర్టిఫికెట్స్‌లో కూడా కులాన్ని వెల్లడించకుండా ఇండియన్ అని మాత్రమే రాశానని ఆమె అన్నారు. దీంతో ఆర్యవైశ్యుల వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టినట్లయింది.
ఇక శేఖర్ సినిమా విషయానికొస్తే.. రాజశేఖర్, ప్రకాష్ రాజ్, శివాని రాజశేఖర్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ మే 20న విడుదల కాబోతోంది. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు జీవిత దర్శకత్వం వహించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.