రాజశేఖర్(Rajasekhar) హీరోగా వస్తున్న కొత్త మూవీ శేఖర్(Sekhar). ఈ సినిమాలో ఆయన కూతురు శివాని(Shivani) కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు జీవిత రాజశేఖర్(Jeevitha Rajasekhar) దర్శకత్వం వహించారు. శేఖర్ సినిమాను ఈనెల 20 థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్(Sekhar Pre release Event) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవితా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవర్నీ మోసం చేయలేదన్నారు. చేతనైతే చాలామందికి హెల్ప్ చేశాను కానీ.. ఎవర్నీ మాత్రం మోసం చేయలేదన్నారు. తనకు కూడా చాలామంది హెల్ప్ చేశారన్నారు జీవిత. శేఖర్ సినిమా విషయంలో తనకు సాయం చేసిన ప్రతీ ఒకరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా జీవిత.. సినిమా టికెట్లు,ఓటీటీ సినిమాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల విషయంలో ఇప్పుడు రకరకాలుగా భయ పెట్టేస్తున్నారన్నారు. సినిమాలకు అసలు జనాలు రావడం లేదని కొందరు చెబుతున్నారన్నారు. కోవిడ్ తర్వాత థియేటర్లకు జనం రావడం తగ్గిపోయిందని అంటున్నారన్నారు. ఓటీటీలోనే సినిమాలు చూస్తున్నారని భయ పెడుతున్నారన్నారు జీవిత. సినిమా తీయడం ఓ ఎత్తైతే.. ఆ సినిమా ఆడుతుందా? ఇన్ని డబ్బులు పెట్టి మనం తీశాం ? ఇలా ఎన్నో ప్రశ్నలు తన మెదడులో మొదలుతున్నాయన్నారు. అయితే శేఖర్ మంచి సినిమా. దయచేసి మీరంతా ఆదరించాలని అభిమానుల్ని కోరారు జీవిత.
టికెట్ల రేట్లు విపరీతంగా పెంచేయడం వల్ల.. కూడా చాలామంది థియేటర్లకు రావడం లేదని తాను విన్నానన్నారు. అయితే పెద్ద పెద్ద సినిమాలు.. కోట్లు ఖర్చు పెట్టే సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకోవడం తప్పదన్నారు జీవిత. మాది చిన్న సినిమా... మా సినిమాకు టికెట్ల రేట్లు పెంచడం లేదన్నారు జీవిత. గవర్నమెంట్ పెట్టిన రేట్లకు మా సినిమా టికెట్లు అమ్మబడతాయన్నారు.శేఖర్ సినిమా బయ్యర్లకు, ఎగ్జిబ్యూటర్లకు ఇదే విషయం చెప్పామన్నారు. శేఖర్ సినిమా టికెట్ల ధరలు ప్రజలకు అందుబాటులోనే ఉంటాయన్నారు జీవిత. అందుకే అందరూ థియేటర్లకు వచ్చి సినిమాను చూడాలన్నారు. శేఖర్ సినిమా వెనుక ఎన్నో కష్టాలు.. ఎన్నో కథలు ఉన్నాయన్నారు. సినిమా కోసం చాలామంది టెక్నీషియన్లు నన్ను సపోర్ట్ చేశారన్నారు. ప్రతీ ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు జీవిత.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jeevitha rajasekhar, Rajasekhar, Shivani rajasekhar, Tollywood