హోమ్ /వార్తలు /సినిమా /

JD Lakshminarayana: నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. వెరీ ఇంట్రెస్టింగ్!

JD Lakshminarayana: నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. వెరీ ఇంట్రెస్టింగ్!

Jd Laxminarayana Photo Twitter

Jd Laxminarayana Photo Twitter

ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ పతాకాలపై బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మిస్తున్న సినిమా 'భీమదేవరపల్లి బ్రాంచి'. ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ నటించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ (JD Lakshminarayana) గురించి తెలియని వారుండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు సూపర్ పాపులారిటీ ఉంది. జగన్ కేసులో ఆయన పేరు పాపులర్ అయింది. అయితే ఇప్పుడు ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం హాట్ టాపిక్ అయింది. నటుడిగా లక్ష్మీ నారాయణ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడాన్ని సిద్ధమయ్యారు. 'భీమదేవరపల్లి బ్రాంచి' (Bheemadevarapalli branchi) అనే సినిమాతో జేడీ లక్ష్మీ నారాయణ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

ఏబీ సినిమాస్ (AB Cinemas), నిహాల్ ప్రొడక్షన్స్ (Nihal Productions) పతాకాలపై బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మిస్తున్న సినిమా 'భీమదేవరపల్లి బ్రాంచి'. ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ నటించారు. ఆయనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఓ పాత్ర చేశారు. ఇద్దరికీ కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం.

ఈ భీమదేవరపల్లి బ్రాంచి సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇంతకుముందు ఎంతో మంది దర్శకులు,నిర్మాతలు, స్వయంగా రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో నటించమని అడిగినా నో చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ భీమదేవరపల్లి బ్రాంచిలో యాక్ట్ చేయడం చెప్పుకోదగిన విషయం. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. దాని ప్రేరణతో ఈ సినిమాను"Neorealism" ఉట్టిపడేలా "స్లైస్ ఆఫ్ లైఫ్" జానర్ లో నిర్మించారు.

చెప్పాలనుకున్న కథలో సహజత్వం పోకూడదని, వెతికి వెతికి అనేకమంది థియేటర్ ఆర్టిస్టులని నటింపజేశారు. వాస్తవికత కళ్ళ ముందుంచే ఈ చిత్రం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఇందులో అంజి బాబు, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, కీర్తి లత, అభి, రూప శ్రీనివాస్,శుభోదయం సుబ్బారావు, సి. ఎస్.ఆర్. వివ రెడ్డి, బుర్ర శ్రీనివాస్ పద్మ, సాయి ప్రసన్న, మానుకోట ప్రసాద్, గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి , వంటి పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Cinema, JD Lakshmi Narayana, Tollywood

ఉత్తమ కథలు