జబర్దస్త్ టీంకు జయసుధ షాక్... భారీ ఆఫర్ ఇచ్చినా...

కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ క్లాస్ ఇమే‌జ్‌ని సొంతం చేసుకున్న జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాత కూడా కుటుంబ విలువలు ఉన్న పాత్రల్లో నటిస్తూ సక్సెస్ అవుతున్నారు.

news18-telugu
Updated: April 14, 2019, 9:41 AM IST
జబర్దస్త్ టీంకు జయసుధ షాక్... భారీ ఆఫర్ ఇచ్చినా...
జయసుధ అసలు పేరు సుజాత నిడదవోలు
  • Share this:
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ కామెడీ షోగా పాపులారిటీ సంపాదించుకొన్నది కార్యక్రమం జబర్దస్త్. ప్రముఖ నటుడు నాగబాబు, హీరోయిన్, పొలిటిషియన్ రోజా ఆ కార్యక్రమాన్ని ఇన్నాళ్లు జడ్జీలుగా వ్యవహరించారు. ఈ షోను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే అత్యంత రేటింగ్ ఉన్న కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినీ తెరకు పరిచయం అయ్యారు. అయితే ఇప్పుడు ఈ షోకు హోస్ట్ చేసేవారు కరువయ్యారు. ఇప్పటివరకు ఈ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా రాజకీయాల కారణంగా షోకి దూరమయ్యారు. దీంతో షో కోసం జడ్జీలను వెతికే పనిలో పడింది జబర్దస్త్ టీం. ఈ నేపథ్యంలో జబర్దస్త్ హెస్ట్‌గా ఉండమని జయసుధను సంప్రదిస్తే.. అందుకు ఆమె నిరాకరించింది. నాగబాబు, రోజాను రీప్లేస్ చేసే ప్రాసెస్ లో జబర్దస్త్ నిర్వాహకులు సీనియర్ నటి జయసుధని సంప్రదించారట. కానీ ఆ ఆఫర్ ని ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ క్లాస్ ఇమే‌జ్‌ని సొంతం చేసుకున్న జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాత కూడా కుటుంబ విలువలు ఉన్న పాత్రల్లో నటిస్తూ సక్సెస్ అవుతున్నారు.

ఇలాంటి నేపధ్యంలో వల్గర్ కామెడీ తనకు సూట్ అవ్వదని జయసుధ సున్నితంగా తనకు వచ్చిన ఆఫర్ ని నిరాకరించినట్లు సమాచారం. నిజానికి ఈ షోకి జడ్జిగా వ్యవహరించడం కోసం జయసుధకి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. కానీ ఆమె మాత్రం రాజీ పడలేదని సమాచారం. జయసుధ ఇలాంటి నిర్ణయం తీసుకొని మంచి పని చేసిందని, ఆమెకి ఇలాంటి వల్గర్ కామెడీ షోలు సెట్ కావని సినీ పరిశ్రమలో కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జయసుధ కాదనడంతో ఆ షోకోసం ఒకప్పటి హీరోయిన్ మీనాని రంగంలోకి దించారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్, మీనా కలిసి ఈ షోని హోస్ట్ చేస్తున్నారు.
First published: April 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading