తెలుగు సినిమా పరిశ్రమలో సుమారు రెండు దశాబ్ధాలకుపైగా సూపర్ స్టార్ (Superstar) అంటే కృష్ణ(Krishna)అనే పేరును సంపాధించుకున్న డేరింగ్ హీరో ఘట్టమనేని శివరామకృష్ణ. టాలీవుడ్లో ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్స్‌ను సొంతం చేసుకున్న కృష్ణ మూడు వందలకుపైగా సినిమాల్లో హీరో నటిస్తే అందులో సుమారు 10-15 మంది హీరోయిన్లు ఎక్కువ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా సూపర్ స్టార్‌తో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్లలో తన రియల్ లైఫ్ పార్టనర్ విజయన నిర్మల (Vijayanirmala)48 సినిమాలతో టాప్‌లో ఉంటే...రీల్ లైఫ్ పార్టనర్‌గా జయప్రద (Jayaprada)45సినిమాలతో టాప్ టూగా నిలిచారు. ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేయడమే కాదు ..వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ కావడం వల్లే కెమిస్ట్రీ రిపీట్ అవుతూ వచ్చింది.
కృష్ణ రియల్ లైఫ్ హీరోయిన్..
నింగికెగసిన సూపర్ స్టార్ హీరో కృష్ణ సినిమాల్లో ఓ ట్రెండ్‌ని సెట్ చేసిన నటుడు. ప్రస్తుతం స్టార్ హీరో పక్కన ఒక హీరోయిన్గా పట్టుమని పది సినిమాలు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కాని ఆ రోజుల్లోనే ఒకే హీరోయిన్‌తో సుమారు 45సినిమాల్లో యాక్ట్ చేశారు కృష్ణ. ఆ హీరోయిన్ ఎవరో కాదు జయప్రద. అంటే కృష్ణ హీరోయిన్లకు ఇచ్చే ప్రాధాన్యత కంటే కూడా హీరో, హీరోయిన్ల కాంబినేషన్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే తన లైఫ్ పార్టనర్‌గా ఉన్న విజయనిర్మల అత్యధిక సినిమాలు అంటే 48సినిమాల్లో సూపర్ స్టార్ పక్కన జోడి కడితే ఆ తర్వాత స్థానంలో జయప్రదకే దక్కింది.
సూపర్ స్టార్ రీల్ లైఫ్ హీరోయిన్ ..
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏ హీరోయిన్కైన సపోర్ట్ ఇచ్చే నటుల్లో కృష్ణ ముందుంటారు. అందుకే బాపు దర్శకత్వంలో విజయా సంస్థ నిర్మించిన శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమాలో కృష్ణతో తొలిసారి జోడి కట్టిన జయప్రద ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ మొదట్లో సక్సెస్ కాకపోియనప్పటికి ‘ఈనాటి బంధం ఏ నాటిదో’ అనే సినిమాతో కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. అంతే అఫ్పటి నుంచి కృష్ణ, జయప్రద హుషారైన పాత్రలు, గ్లామర్ పాత్రల్లో చూపించాలని ట్రై చేసినట్లుగా తెలుస్తోంది.
క్రేజీ కాంబినేషన్..
కృష్ణ, జయప్రద చలాకితనం అల్లరి బుల్లోడు చిత్రాన్ని సక్సెస్ చేసింది. కేవలం ఈసినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌కి అభిమానలు ఫిదా అయ్యారు. మూవీని సక్సెస్ చేశారు.ఆ సినిమాలోని చుక్కల తోటలో ఎక్కడున్నావో.. పక్కకు రావే సిరిమల్లె పువ్వా అనే సాంగ్ ఎవర్‌గ్రీన్‌గా మారింది. ఆ ఆతర్వాత కూడా వీరిద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా మ్యూజికల్‌గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మొదట్లో అంటే కలర్ సినిమాలు రాక ముందు కృష్ణతో విజయనిర్మల హిట్ పెయిర్ అయితే కలర్ సినిమాలు వచ్చిన తర్వాత సూపర్ స్టార్, జయప్రదే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే విధంగా జోడి కుదిరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.