దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సినీ, రాజకీయ జీవితం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇపుడామె జీవితంపై పలువురు దర్శక, నిర్మాతలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నారు. ఓ సినీ నటిగా, పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. 2016లో అనారోగ్య కారణాలతో కన్నుమూసారు. ఆమె మరణం కూడా ఒక మిస్టరీయే. ఇప్పటికే కంగనా హీరోయిన్గా ‘తలైవి’ సినిమా చేస్తోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తే ఒక వైపు పొగడ్తలు మరోవైపు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక నిత్యామీనన్..జయలలితగా ‘ది ఐరన్ లేడీ’ అనే సినిమా తెరకెక్కతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఒక బయోపిక్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇవి చాలవన్నట్టు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.. అమ్మ జయలలిత జీవితంపైరమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. ‘క్వీన్’ పేరుతో వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీటైంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు.
ఇందులో స్కూల్ చదివే రోజుల్లో జయలలిత టాపర్. 18 ఏళ్లకే స్టార్ హీరోయిన్. చిన్నవయసులోనే ముఖ్యమంత్రి అయిన వనిత. ఈ వెబ్ సిరీస్‌లో జయ లలిత విద్యార్ధినిగా, నటిగా, రాజకీయ నాయకురాలిగా ఒక్కో నటితో ఆ వేషం వేయించారు. డిసెంబర్ 14న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు MX ప్లేయర్లో ప్రసారం కానుంది. మొత్తంగా 10 భాగాలుగా జయలలిత వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్‌ను మురుగేశన్ అనే దర్శకుడితో కలిసి గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Jayalalithaa Biopic, Jayalalithaa Web Series Queen, Kollywood, Ramya Krishna, Tollywood