Home /News /movies /

JAYALALITHA DEATH ANNIVERSARY LATE ACTRESS COULD NOT WATCH HER FIRST TAMIL MOVIE IN THEATERS MNJ

Jayalalitha Birth Anniversary: తన మొదటి సినిమాను చూసేందుకు జయలలితకు 'నో' పర్మిషన్. కారణం ఏంటో తెలుసా

జయలలిత

జయలలిత

Jayalalitha: ఒక సామాన్య కుటుంబంలో పుట్టి.. హీరోయిన్‌గా ఖ్యాతిని ఘ‌డించి.. ముఖ్య‌మంత్రిగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర‌ను వేసింది పురు్చి త‌లైవి అలియాస్ జ‌య‌ల‌లిత అలియాస్ అమ్మ‌. చిన్న వ‌య‌సులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాదు.. చిన్న వ‌య‌సులోనే ముఖ్య‌మంత్రి అన్న పెద్ద ప‌ద‌విని కూడా చేప‌ట్టి.. స‌మ‌ర్థ‌వంతంగా రాష్ట్రాన్ని న‌డిపారు

ఇంకా చదవండి ...
    Jayalalitha: ఒక సామాన్య కుటుంబంలో పుట్టి.. హీరోయిన్‌గా ఖ్యాతిని ఘ‌డించి.. ముఖ్య‌మంత్రిగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర‌ను వేసింది పురు్చి త‌లైవి అలియాస్ జ‌య‌ల‌లిత అలియాస్ అమ్మ‌. చిన్న వ‌య‌సులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాదు.. చిన్న వ‌య‌సులోనే ముఖ్య‌మంత్రి అన్న పెద్ద ప‌ద‌విని కూడా చేప‌ట్టి.. స‌మ‌ర్థ‌వంతంగా రాష్ట్రాన్ని న‌డిపారు. ఆమె జీవింతో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఎన్నో ఉత్తానపతనాలను ఉన్నాయి.. మరెన్నో కష్టనష్టాలు ఉన్నాయి. అయితే వాట‌న్నింటిని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొని.. మ‌ర‌ణించిన త‌రువాత కూడా త‌న‌ను అంద‌రూ గుర్తు చేసుకునేలా సుస్థిర ఖ్యాతిని తెచ్చుకున్నారు జ‌య‌ల‌లిత‌. ఆమె జీవితం ఎంతో మందికి ఆద‌ర్శం. కాగా ఇవాళ జ‌య‌ల‌లిత 73వ జ‌యంతి. ఈ సంద‌ర్బంలో ఆమె జీవితంలోని ఒక ఆస‌క్తిక‌ర విష‌యం. అదేంటంటే త‌మిళంలో హీరోయిన్‌గా న‌టించిన త‌న మొద‌టి చిత్రాన్ని ఆమె విడుద‌లైన స‌మ‌యంలో చూడ‌లేక‌పోయారు. దానికి కార‌ణం ఏంటంటే..

    బాలీవుడ్ స్టార్ న‌టుడు కృష్ణ కుమార్ న‌టించిన మాన్ మౌజీ చిత్రంలో ఓ మూడు నిమిషాల పాట‌లో కృష్ణుడిగా న‌టించారు జ‌య‌ల‌లిత‌. ఇక త‌మిళంలో ఆమె.. వెన్నిర అడై అనే ఓ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించారు. 1965లో ఈ చిత్రం విడుద‌ల కాగా.. ఈ సినిమాను చూసేందుకు జ‌య‌ల‌లిత‌కు అనుమ‌తి ల‌భించ‌లేదు. ఎందుకంటే ఈ మూవీకి అప్ప‌ట్లో ఏ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. ఇక అప్ప‌టికి జ‌య‌ల‌లిత వ‌య‌సు 17 సంవ‌త్స‌రాలు కాగా.. ఈ సినిమాను చూసేందుకు ఆమెకు అనుమ‌తి దొర‌క‌లేదు.

    ఈ సినిమాలో స్లీవ్‌లెస్ జాకెట్‌ని ధ‌రించి ఒక జ‌లపాతం ద‌గ్గ‌ర జ‌య‌ల‌లిత ఓ డ్యాన్స్ చేస్తుంది. దానిపై కూడా అప్ప‌ట్లో సెన్సార్ బోర్డు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అయితే ఈ చిత్రం అప్ప‌ట్లో పెద్ద విజ‌యాన్ని సాధించింది. 100 రోజుల పాటు విజ‌య‌వంతంగా ఆడిన ఈ చిత్రం.. జ‌య‌ల‌లిత‌కు ఓవ‌ర్‌నైట్ స్టార్‌డ‌మ్‌ని కూడా తీసుకొచ్చింది. అప్ప‌టి నుంచి ఆమె కూడా వెనుదిరిగి చూడ‌లేదు. ఈ క్ర‌మంలో ఒకానొక స‌మ‌యంలో వ‌రుస‌గా 11 హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న జ‌య‌ల‌లిత‌.. త‌మిళంలో అత్య‌ధిక పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగింది.
    Published by:Manjula S
    First published:

    Tags: Jayalalitha

    తదుపరి వార్తలు