Home /News /movies /

JAYALALITHA BIOPIC THALAVI TEASER RELEASED AND KANGANA RANAUT EXCELLED AS AMMA PK

జయలలిత ‘తలైవి’ టీజర్.. అమ్మ గురించి తెలియని విషయాలు..

జయలలిత బయోపిక్ తలైవి పోస్టర్ (thalaivi movie)

జయలలిత బయోపిక్ తలైవి పోస్టర్ (thalaivi movie)

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త న‌టి జయలలిత చ‌నిపోయి రెండేళ్లు దాటేసినా ఇప్ప‌టికీ ఆమె స్మ‌ర‌ణంలోనే ఉన్నారు అభిమానులు. అమ్మ అంటూ ఇప్ప‌టికీ ఆమెనే త‌లుచుకుంటున్నారు. ఇక ఇప్పుడు మ‌రోసారి..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త న‌టి జయలలిత చ‌నిపోయి రెండేళ్లు దాటేసినా ఇప్ప‌టికీ ఆమె స్మ‌ర‌ణంలోనే ఉన్నారు అభిమానులు. అమ్మ అంటూ ఇప్ప‌టికీ ఆమెనే త‌లుచుకుంటున్నారు. ఇక ఇప్పుడు మ‌రోసారి ఈమె పాత్ర‌కు ప్రాణం పోయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తాజాగా జ‌య‌ల‌లిత బ‌యోపిక్ తలైవి టీజర్ విడుదలైంది. కంగన రనౌత్ ఇందులో అమ్మ పాత్రలో నటిస్తుంది. ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ ఈ బ‌యోపిక్ తెరకెక్కిస్తున్నాడు. ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన విష్ణు ఇందూరి ఇప్పుడు త‌లైవి సినిమాను నిర్మిస్తున్నాడు.

Jayalalitha biopic Thalavi teaser released and Kangana Ranaut excelled as Amma pk తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త న‌టి జయలలిత చ‌నిపోయి రెండేళ్లు దాటేసినా ఇప్ప‌టికీ ఆమె స్మ‌ర‌ణంలోనే ఉన్నారు అభిమానులు. అమ్మ అంటూ ఇప్ప‌టికీ ఆమెనే త‌లుచుకుంటున్నారు. ఇక ఇప్పుడు మ‌రోసారి.. thalaivi teaser,kangana ranaut jayalalitha,thalaivi teaser released,al vijay kangana ranaut,sobhan babu,jayalalitha,jayalalitha biopic,jayalalitha biopic thalaivi movie,aravind swamy in jayalalitha biopic,actor sobhan babu,jayalalitha daughter,sobhan babu family,sobhan babu wife,sobhan babu jayalalitha,sobhan babu jayalalitha movies,sobhan babu jayalalitha relationship,jayalalitha MGR movies,jayalalitha MGR,sobhan babu hit songs,sobhan babu hit movies,jayalalitha biopic,jayalalitha biopic movie,jayalalitha biopic thalaivi,kangana ranaut jayalalitha biopic,jayalalitha biopic first look,kangana ranaut thalaivi,jayalalitha biopic kangana ranaut,kangana ranut jayalalithaa biopic,kangana ranaut jayalalithaa biopic,jayalalitha & sobhan babu,jayalalitha shobhan babu,jayalalitha & sobhan babu love scenes,sobhan babu mystery,sobhan babu and jayalalitha,sobhan babu movies,telugu cinema,jayalalitha shobhan babu affair,తలైవి టీజర్,తలైవి బయోపిక్ టీజర్,జయలలిత,జయలలిత శోభన్ బాబు,జయలలిత బయోపిక్ తలైవి,శోభన్ బాబు జయలలిత బంధం,తమిళ్ సినిమా
జయలలిత బయోపిక్ తలైవి పోస్టర్


ఫిబ్రవరి 24వ తేదీ జయలలిత జ‌యంతి సందర్భంగా ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ కొబ్బరికాయ్ కొట్టాడు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ సిద్ధం చేసాడు విజ‌య్. ఈ సినిమాలో జయలలిత జీవితంలో జరిగిన కొన్ని తెలియని ఆసక్తికరమైన విషయాల గురించి చూపించబోతున్నాడు విజయ్. ఈ పేరు మీకు తెలుసు.. కానీ ఈమె గురించి మీకు తెలియదు అంటూ టీజర్‌లో చూపించాడు దర్శకుడు విజయ్.

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ చేయ‌డానికి ఇప్పుడు ఫ్యామిలీ మెంబ‌ర్స్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. సినిమాలో ఎలాంటి వివాదాల లేకుండా నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. ఈ సినిమాకు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందిస్తుండ‌టంతో అంచ‌నాలు కూడా భారీగా ఉన్నాయి. దీనికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తుండ‌గా.. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ దారుణంగా ముంచేసినా కూడా ఇప్పుడు మ‌రోసారి బ‌యోపిక్ నిర్మిస్తున్నాడు విష్ణు ఇందూరి. మ‌రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఎలాంటి అద్భుతాన్ని చేస్తుందో చూడాలిక‌. అన్నట్లు ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు.
First published:

Tags: Jayalalitha, Tamil Cinema, Telugu Cinema, Thalaivi, Tollywood

తదుపరి వార్తలు