Home /News /movies /

JAYALALITHA BIOPIC THALAIVI SHOOT COMPLETED KANGANA EMOTIONAL TWEET MHN

Thalaivi Shoot Completed: `త‌లైవి` షూట్‌ను పూర్తి చేసిన కంగ‌నా..ఎమోష‌న‌ల్ ట్వీట్‌

Thalaivi Shoot Completed Kangana Emotional Tweet

Thalaivi Shoot Completed Kangana Emotional Tweet

Kangana Ranaut - Thalaivi Movie: త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ త‌లైవి చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా కంగ‌నా ఎమోష‌న‌ల్ ట్వీట్ పోస్ట్ చేస్తూ ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్ చెప్పారు.

    బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్ చేస్తున్న సినిమా `త‌లైవి` ఒక‌టి. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఇది. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని కంగ‌నా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. జ‌య‌ల‌లిత విజ‌య సంకేతం చూపిస్తున్న ఫొటో.. దాని ప‌క్క‌నే ఆమెలాగానే ఫోజు పెడుతున్న త‌న లుక్‌ను పోస్ట్ చేసింది కంగ‌నా. ``ఓ ల‌క్ష్యంతో చేసిన మా త‌లైవి సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఓ విప్లవ నాయ‌కురాలి పాత్ర‌. సాధార‌ణంగా ఓ న‌టుడికి అరుదుగా దొరికే పాత్ర‌. నేను ఈ పాత్ర‌తో ప్రేమ‌లో ప‌డిపోయాను. ఇప్పుడు ఈ సినిమాకు ముగింపు ప‌ల‌క‌డం చాలా బాధ‌గా, క‌ష్ట‌త‌రంగా ఉంది. మిశ్ర‌మ భావోద్వేగాలతో మ‌న‌సు నిండిపోయింది. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్‌, బృంద ప్ర‌సాద్‌, నీతా లుల్లా, ర‌జ‌త్ స‌రోరా, విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, బ‌ల్లూస‌లూజ‌, జీవీ ప్ర‌కాశ్, అర‌వింద స్వామి, డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్‌ వంటి స్టార్స్‌తో క‌లిసి న‌టించ‌డం జీవితంలో దొరికే అదృష్టంగా భావిస్తున్నాను. ప్ర‌తి ఒకరికీ మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు చెబుతున్నాను`` అని అన్నారు కంగ‌నా ర‌నౌత్‌.

    లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ వ‌స్తున్న కంగ‌నా ర‌నౌత్ కెరీర్‌లో క‌చ్చితంగా ఇదొక వైవిధ్య‌మైన చిత్ర‌మ‌నే చెప్పాలి. జ‌య‌ల‌లిత వంటి నాయకురాలి పాత్ర‌లో తెర‌పై క‌న‌ప‌డ‌టం అంటే సామాన్య‌మైన విష‌యం కాదు. ఆమె అభిమానులు, పొలిటిక‌ల్ ప‌రంగానూ ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జ‌య‌ల‌లిత జ‌యంతి(ఫిబ్ర‌వ‌రి 24)న ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు మిగిలాయి. ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గానే పూర్తి చేస్తారు.

    విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, ర‌జ‌త్ అరోరా రైట‌ర్స్ మ‌లచిన `త‌లైవి` సినిమాలో ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద‌స్వామి, క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్‌, జ‌య‌ల‌లిత స్నేహితురాలు శ‌శిక‌ళ పాత్ర‌లో పూర్ణ‌, శోభ‌న్‌బాబు పాత్ర‌లో జిస్సుసేన్ గుప్తా త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా ఇది. ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌`, క‌పిల్ సేన వ‌ర‌ల్డ్‌క‌ప్‌జ‌ర్నీ గురించి చెప్పే `83` సినిమాల‌ను నిర్మించిన నిర్మాత విష్ణు ఇందూరి ఈ సినిమా నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించారు. ఇప్పుడు త‌మిళంలో ఐర‌న్ లేడీ పేరుతో నిత్యామీన‌న్ కూడా జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో న‌టించింది. ఈ సినిమా విడుద‌ల తేదీ కూడా త్వ‌ర‌లోనే ఖ‌రార‌వుతుంది.
    Published by:Anil
    First published:

    Tags: Jayalalitha, K. V. Vijayendra Prasad, Kangana Ranaut, Thalaivi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు