Home /News /movies /

JAYALALITHA BIOPIC THALAIVI MOVIE RELEASE DATE CONFIRMED ACTED KANGANA RANAUT PK

Kangana Ranaut Thalaivi: ఎట్టకేలకు విడుదలవుతున్న కంగన రనౌత్ ‘తలైవి’..

తలైవి రిలీజ్ డేట్ (Thalaivi movie)

తలైవి రిలీజ్ డేట్ (Thalaivi movie)

Kangana Ranaut Thalaivi: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త న‌టి జయలలిత (Kangana Ranaut Thalaivi) చ‌నిపోయి నాలుగేళ్ళవుతున్నా ఇప్ప‌టికీ ఆమె స్మ‌ర‌ణంలోనే ఉన్నారు అభిమానులు. అమ్మ అంటూ ఇప్ప‌టికీ ఆమెనే త‌లుచుకుంటున్నారు. ఇప్పుడు మ‌రోసారి ఈమె పాత్ర‌కు ప్రాణం పోయ‌డానికి సిద్ధమయ్యారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఇంకా చదవండి ...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త న‌టి జయలలిత చ‌నిపోయి నాలుగేళ్ళవుతున్నా ఇప్ప‌టికీ ఆమె స్మ‌ర‌ణంలోనే ఉన్నారు అభిమానులు. అమ్మ అంటూ ఇప్ప‌టికీ ఆమెనే త‌లుచుకుంటున్నారు. ఇప్పుడు మ‌రోసారి ఈమె పాత్ర‌కు ప్రాణం పోయ‌డానికి సిద్ధమయ్యారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తాజాగా జ‌య‌ల‌లిత బ‌యోపిక్ తలైవి విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. కంగన రనౌత్ ఇందులో అమ్మ పాత్రలో నటిస్తుంది. ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ ఈ బ‌యోపిక్ తెరకెక్కిస్తున్నాడు. ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన విష్ణు ఇందూరి ఇప్పుడు త‌లైవి సినిమాను నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 10న జయలలిత బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తైపోయి కూడా ఏడాది అయిపోయింది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ సిద్ధం చేసాడు విజ‌య్. ఈ సినిమాలో జయలలిత జీవితంలో జరిగిన కొన్ని తెలియని ఆసక్తికరమైన విషయాల గురించి చూపించబోతున్నాడు విజయ్.

ఈ పేరు మీకు తెలుసు.. కానీ ఈమె గురించి మీకు తెలియదు అంటూ ఇప్పటికే టీజర్‌లో చూపించాడు దర్శకుడు విజయ్. జ‌య‌ల‌లిత బ‌యోపిక్ చేయ‌డానికి ఇప్పుడు ఫ్యామిలీ మెంబ‌ర్స్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. సినిమాలో ఎలాంటి వివాదాల లేకుండా నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. ఈ సినిమాకు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందిస్తుండ‌టంతో అంచ‌నాలు కూడా భారీగా ఉన్నాయి.

దీనికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తుండ‌గా.. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ దారుణంగా ముంచేసినా కూడా ఇప్పుడు మ‌రోసారి బ‌యోపిక్ నిర్మిస్తున్నాడు విష్ణు ఇందూరి. మ‌రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఎలాంటి అద్భుతాన్ని చేస్తుందో చూడాలిక‌. అన్నట్లు ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. శోభన్ బాబు పాత్రలో బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా నటిస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jayalalitha film, Kangana Ranaut, Telugu Cinema, Thalaivi film, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు