Home /News /movies /

JAYALALITHA BIOPIC THALAIVI MOVIE DIGITAL RIGHTS SOLD FOR A BOMB AND PRODUCERS ARE IN THE SKY PK

తలైవి సినిమాకు భారీ డిమాండ్.. ఓటిటిలో అదిరిపోయే రేట్..

తలైవి: జయలలిత జీవితంపై వస్తున్న సినిమా ఇది. కంగన రనౌత్ హీరోయిన్‌గా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాంట్రవర్సీలు పెద్దగా ఉండకపోవచ్చు. పూర్తిగా అమ్మ జీవితాన్ని సెలబ్రేట్ చేసే సినిమా ఇది.

తలైవి: జయలలిత జీవితంపై వస్తున్న సినిమా ఇది. కంగన రనౌత్ హీరోయిన్‌గా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాంట్రవర్సీలు పెద్దగా ఉండకపోవచ్చు. పూర్తిగా అమ్మ జీవితాన్ని సెలబ్రేట్ చేసే సినిమా ఇది.

Thalaivi: జయలలిత.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తెలుగు. తమిళ రాష్ట్రాలలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పి ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా చెరగని ముద్ర వేసిన ఐరెన్ లేడీ.

జయలలిత.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తెలుగు. తమిళ రాష్ట్రాలలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పి ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా చెరగని ముద్ర వేసిన ఐరెన్ లేడీ. ఈమె చనిపోయిన తర్వాత జీవితంపై చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. ఇప్పటికే రమ్యకృష్ణ కీలక పాత్రలో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన క్వీన్ విడుదలైంది కూడా. ఇప్పుడు తలైవి పేరుతో బయోపిక్ చేస్తున్నాడు దర్శకుడు ఏఎల్ విజయ్. ఇందులో కంగన రనౌత్ హీరోయిన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఐదు భాషల్లో తలైవి తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది.
జయలలిత బయోపిక్ తలైవి పోస్టర్ (thalaivi movie)
జయలలిత బయోపిక్ తలైవి పోస్టర్ (thalaivi movie)

జయలలిత జీవితాన్నే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు విజయ్. అందుకోసం ఆమె కుటుంబ సభ్యుల అనుమతిని కూడా తీసుకున్నాడు. ఇప్పటికే నో అబ్జక్షన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. తెలుగు తమిళం కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో కథానాయికగా విభిన్న పాత్రలు పోషించారు జయలలిత. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్.. టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్నాడు.
జయలలిత బయోపిక్ తలైవి పోస్టర్ (thalaivi movie)
జయలలిత బయోపిక్ తలైవి పోస్టర్ (thalaivi movie)

16 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ళ వరకు ఆమె జీవితంలో జరిగిన చాలా విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాడు విజయ్. ఇదిలా ఉంటే తలైవి సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ 55 కోట్ల రేట్ ఇచ్చి మరీ తీసుకున్నాయని తెలుస్తుంది. అయితే నేరుగా థియేటర్స్‌లో విడుదల చేసిన తర్వాతే ఓటిటిలోకి వస్తుందని మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు నిర్మాతలు. 5 భాషల్లో వస్తున్న ఈ చిత్ర హక్కులను అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కలిసి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఇంత భారీ రేట్ ఇచ్చి తీసుకోవడం మాత్రం నిజంగానే సంచలనంగా మారుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jayalalitha, Telugu Cinema, Thalaivi

తదుపరి వార్తలు