Javed Akhtar: జావేద్ అక్తర్‌కు థానే కోర్టు షోకాజ్ నోటీసు.. ఆర్ఎస్ఎస్‌ను తాలిబన్‌లతో పోల్చిన వ్యవహారంలో సమన్లు

జావేద్ అఖ్తర్

గీత రచయిత జావేద్ అక్తర్‌ ఆర్ఎస్ఎస్ ను తాలిబన్లతో పోల్చుతూ ఆయన వివాదాస్పద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడా ఆరోపణలే ఆయనను చిక్కుల్లో పడేశాయి. జావేద్‌పై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వివేక్ చంపనేర్కర్ అడిషనల్ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

  • Share this:
కొద్ది రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్, గీత రచయిత జావేద్ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తాలిబన్లతో పోల్చుతూ ఆయన వివాదాస్పద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడా ఆరోపణలే ఆయనను చిక్కుల్లో పడేశాయి. జావేద్‌పై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వివేక్ చంపనేర్కర్ అడిషనల్ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆర్ఎస్ఎస్ కు పరువు నష్టం కలిగించినందున అక్తర్ రూ.1 నష్టపరిహారంగా ఇవ్వాలని వివేక్ కోరారు. ఈ పరువు నష్టం దావాను పరిగణలోకి తీసుకున్న థానే కోర్టు జావేద్ అక్తర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ నవంబర్ 12న అక్తర్‌ కోర్టు ముందు హాజరు కావాలని నోటీసు పంపింది.

Movies: పండుగ సీజన్‌లో దేశవ్యాప్తంగా సినిమాల సందడి.. ఒకే తేదీన బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్న హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ సినిమాలు ఇవే.. ?


రచయిత జావేద్ అఖ్తర్ ఈ నెల మొదటి వారంలో ఒక వార్తా ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా రైట్-వింగ్‌కు అసాధారణమైన పోలిక ఉందన్నారు. "తాలిబన్లు ఎలా ఇస్లామిక్‌ దేశం కావాలనుకుంటున్నారో.. ఈ వ్యక్తులు కూడా హిందూ రాజ్యాన్ని స్థాపించాలకుంటున్నారు" అని ఆర్‌ఎస్‌ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసిన ఫిర్యాదుదారుడి తరఫున అడ్వకేట్ ఆదిత్య మిశ్రా కోర్టులో హాజరయ్యారు. ఈ కేసుపై ఆయన సుదీర్ఘంగా వాదించారు. ప్రతివాది అక్తర్ ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ షోలో ఆర్‌ఎస్‌ఎస్ కి వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. హిందువుల వస్త్రధారణను దూషించే లక్ష్యంతో అనాగరిక తాలిబన్లతో హిందూ ధర్మం కోసం పనిచేసే సంస్థలను అక్తర్ పోల్చాడని అడ్వకేట్ ఆదిత్య మిశ్రా కోర్టులో చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతివాది అవాస్తవమైన, నిరాధారమైన ఆరోపణలను చేశారని మిశ్రా చెప్పారు. కోట్ల ప్రజల అభిమానాన్ని చూరగొన్న హిందూత్వ సంస్థను అక్తర్ ఉద్దేశపూర్వంగా కించపరిచారని తన వాదనలో చెప్పుకొచ్చారు. వాదనలు విన్న అనంతరం కోర్టు జావేద్ అక్తర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Pawan Kalyan: వైసీపీ మంత్రులు ఒకవైపు.. పవన్ ఒక వైపు.. వరుస ట్వీట్లతో దూకుడు పెంచిన జనసేనాని..


సామాన్య ప్రజల దృష్టిలో ఆర్‌ఎస్‌ఎస్ ఇమేజ్‌ని కించపరచడమే లక్ష్యంగా ప్రతివాది వ్యాఖ్యలు ఉన్నాయని చంపనేర్కర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా ప్రతివాది చేసిన వ్యాఖ్యలతో తాను బాధ పడ్డానని చెప్పారు. అందువల్ల అక్తర్ ఒక రూపాయి పరిహారం చెల్లించాల్సిందిగా పిటిషన్‌లో పేర్కొన్నానని చెప్పారు.
Published by:Krishna Adithya
First published: