Jathi Ratnalu on Amazon Prime : వైజయంతి మూవీస్ సమర్పణలో నాగ్ అశ్విన్ నిర్మాణంలో అనుదీప్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం జాతి రత్నాలు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్’టైనర్ జాతిరత్నాలు. రిలీజ్ ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఓవర్సీస్‌లో విపరీతంగా ఆకట్టుకుంది. చెప్పాలంటే లాక్ డౌన్ తర్వాత విడుదలైన అన్ని సినిమాల కలెక్షన్స్‌ను తుడిచిపెట్టింది. సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండడంతో అందరూ.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దాదాపు రూ. 70 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా కలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ ఇండియా ఏప్రిల్ 11 ( ఈ రోజు) నుంచి స్ట్రీమ్ అవుతోంది. దీంతో ఇప్పటివరకు పెద్ద తెరపై చూసిన ఈ సినిమాను ఈ రోజు నుంచి ఎంచక్కా మొబైల్లో.. టీవీల్లో చూడోచ్చు.
ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నవీన్ పొలిశెట్టి విషయానికి వస్తే.. ఆయన ఆ మధ్య ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయమ్యాడు. నవీన్ పోలిశెట్టి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చని ‘నేనొక్కడినే (వన్) సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. నవీన్ హిందీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్‌ల ‘చిచ్చోరే’ సినిమాలో యాసిడ్‌గా తన యాక్టింగ్‌తో మెప్పించాడు.
ఈ సినిమాలో నవీన్‌కు జోడిగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్, విజయ్ దేవరకొండలు కూడా కనిపించి అలరించారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండడంతో అందరూ.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.