Home /News /movies /

JATHI RATNALU MOVIE CONTROVERSY POLICE CASE FILED AGAINST MOVIE MAKERS HERE ARE THE DETAILS TA

Jathi Ratnalu: జాతి రత్నాలు మూవీపై వివాదం.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు..

వివాదంలో ‘జాతి రత్నాలు’ మూవీ (Twitter/Photo)

వివాదంలో ‘జాతి రత్నాలు’ మూవీ (Twitter/Photo)

Jathi Ratnalu | ఈ మధ్యాకాలంలో ఏ సినిమా తీసుకున్న ఏదో ఒక వివాదం సినిమాను తీసిన వాళ్లను వెంటాడుతోంది. తాజాగా శివరాత్రి కానుకగా విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే.. 

    Jathi Ratnalu | ఈ మధ్యాకాలంలో ఏ సినిమా తీసుకున్న ఏదో ఒక వివాదం సినిమాను తీసిన వాళ్లను వెంటాడుతోంది. తాజాగా శివరాత్రి కానుకగా విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా లాక్‌డౌన్  తర్వాత థియేటర్స్‌ తెరుచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్స్ నడుపుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రేక్షకులు కరోనాకు భయపడకుండా ఎంచక్కా థియేటర్స్‌కు వెళ్లి సినిమాలు చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వరస విజయాలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న ప్రేక్షకులు ఎలాంటి భయాలు లేకుండా థియేటర్స్‌కు వస్తున్నారు. ఈ యేడాది జనవరిలో ‘క్రాక్’మూవీతో మొదలైన కలెక్షన్ల ప్రభంజనం.. ఫిబ్రవరిలో ‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగిసింది.  ఆ తర్వాత మళ్లీ ‘జాతి రత్నాలు’ సినిమాతో థియేటర్స్ కళ కళ లాడుతున్నాయి. నేటితో రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలో అడుగుపెట్టింది ఈ సినిమా. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోన్న ఈ సినిమా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది.

    నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో దేశభక్తి ప్రేరేపించే ఓ కవితను వ్యంగ్యంగా ఆలపించారని ఓ ఓ జాతీయ పార్టీకి చెందిన తెలంగాణ విభాగం నేతలు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉరి కంబానికి వేలాడే ముందు సర్ఫరోష్ కీ తమన్నా హమ్ హమారే దిల్ మే హై అంటూ పాడిన పాటను జాతి రత్నాలు సినిమాలో అవమానించే రీతిలో ఆలిపించారు. దేశభక్తిని నింపే ఈ గేయ పంక్తుల్లో టాలీవుడ్ హీరోయిన్లు పేర్లు దేశభక్తులను గాయ పరిచారని శివ సేన నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఈ మేరకు జాతీయ పార్టీకి చెందిన  తెలంగాణ విభాగం వాళ్లు హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. స్వాతంత్య్ర సమరయోధులను కించపరిచేలా వ్యవహరించిన సినిమా దర్శకుడు, నిర్మాత, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు ఈ సినిమాలో ఆ సన్నివేశాలను తొలిగించాలన్నారు. లేకపోతే ఈ సినిమాను నిషేధించాలని కోరారు. మొత్తంగా వివాదం ఎలాంటి ముగింపు పలుకుతుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jathi Ratnalu, Nag Ashwin, Naveen Polishetty, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు