Home /News /movies /

JATHI RATNALU MOVIE CLOSING COLLECTIONS AND NAVEEN POLISHETTY MOVIE BECOMES TRIPLE BLOCKBUSTER PK

Jathi Ratnalu closing collections: ‘జాతి రత్నాలు’ క్లోజింగ్ కలెక్షన్స్.. జోగిపేట్ కుర్రాళ్లు కుమ్మేసారు..

జాతి రత్నాలు (Jathi Ratnalu)

జాతి రత్నాలు (Jathi Ratnalu)

Jathi Ratnalu closing collections: న‌వీన్ పోలిశెట్టి(Naveen Polishetty), ఫ‌రియా అబ్దుల్లా జంటగా అనుదీప్ తెరకెక్కించిన జాతి రత్నాలు బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. నిజంగానే వాళ్లు బాక్సాఫీస్ జాతి రత్నాలు (Jathi Ratnalu)అయిపోయారు. రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ మీ కోసం..

ఇంకా చదవండి ...
2021 చిన్న సినిమాలకు బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు అంచనాలకు మించి వసూళ్లు సాధించాయి. మీడియం బడ్జెట్‌తోనే వచ్చిన సినిమాలు నిర్మాతలకు 30-40 కోట్ల లాభాలు తీసుకొచ్చాయి. అలాంటి సినిమాల్లో జాతి రత్నాలు కూడా ఉంటుంది. న‌వీన్ పోలిశెట్టి, ఫ‌రియా అబ్దుల్లా జంటగా అనుదీప్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలైన జాతి రత్నాలు తొలిరోజు నుంచే సంచలన వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే 11 కోట్ల లక్ష్యం పూర్తి చేసుకుని మూడు వారాల పాటు బాగా ఆడింది. తాజాగా ఫుల్ రన్ కలెక్షన్స్ బయటికి వచ్చాయి. ఈ చిత్రం 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం..

జాతి రత్నాలు ఫుల్ రన్ కలెక్షన్స్..

నైజాం: 16 కోట్లు
సీడెడ్:  4.27 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.97 కోట్లు
ఈస్ట్:  1.92 కోట్లు
వెస్ట్:  1.52 కోట్లు
గుంటూరు: 2.09 కోట్లు
కృష్ణా:  1.84 కోట్లు
నెల్లూరు:  0.91 కోట్లు

ఏపీ + తెలంగాణ ఫుల్ రన్ కలెక్షన్స్:  32.52 కోట్లు (54 కోట్ల గ్రాస్)
రెస్ట్ ఆఫ్ ఇండియా:  1.72 కోట్లు
ఓవర్సీస్:  4.28 కోట్లు

వరల్డ్ వైడ్ ఫుల్ రన్ టోటల్: 38.76 కోట్లు షేర్ (68 కోట్ల గ్రాస్)
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Box Office Collections, Jathi Ratnalu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు