దర్శకుడు అనుదీప్ డైరెక్షన్‌లో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన కామెడీ ఎంటర్’టైనర్ (Jathi Ratnalu ) జాతిరత్నాలు. ఈ సినిమా మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో విపరీతంగా ఆకట్టుకుంది. చెప్పాలంటే లాక్ డౌన్ తర్వాత విడుదలైన అన్ని సినిమాల కలెక్షన్స్‌ను తుడిచిపెట్టింది. సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండడంతో అందరూ.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా తర్వాత దర్శకుడు అనుదీప్ ఇంత వరకు ఏ సినిమాను ప్రకటించలేదు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఆయన దర్శకత్వంలో ఓ సీనియర్ హీరో నటించనున్నాడని తెలుస్తోంది.
జాతి రత్నాలు తర్వాత అనుదీప్ కీ భారీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు అగ్ర నిర్మాణ సంస్థల నుంచి అనుదీప్ కి ఆఫర్లు వచ్చాయట. అయితే ఇప్పటి వరకూ ఏ సినిమా పట్టాలెక్కించలేదు. రెండో సినిమాని ఓ పెద్ద హీరోతో చేయాలన్నది అనుదీప్ ప్లాన్. అందులో భాగంగా సీనియర్ స్టార్ హీరో వెంకటేష్‌తో ఓ సినిమాను చేయనున్నారని తెలుస్తోంది.
Ram Charan | Shankar : ఆ ఒక్క ఫైట్ సీన్‌కు పదికోట్లు ఖర్చు చేస్తున్న శంకర్..
వెంకటేష్ కోసం అనుదీప్ (Anudeep KV) ఓ కథను సిద్ధం చేశారట. అంతేకాదు వెంకటేష్ (Venkatesh) కూడా ఆ కథను ఓకే చేశారని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా పూర్తిగా కామెడీ జానర్‌లో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక వెంకటేష్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే..
వెంకటేష్ (Venkatesh) ఓ మలయాళీ చిత్రాన్ని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైనా దృశ్యం 2 సినిమాను (Drishyam 2) తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మలయాళం దృశ్యం 2లో మోహన్ లాల్ హీరోగా చేసారు. ఈ సినిమా అక్కడ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై అదరగొట్టింది. ఈ సినిమాను మొదట్లో థియేటర్స్‌లో విడుదల చేయాలనీ చూశారు. అయితే కరోనా కారణంగా విడుదల వీలు కాలేదు. దీంతో చిత్రబృందం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలనీ భావించారని టాక్ నడిచింది. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు దృశ్యం2ను సినిమాను డైరెక్ట్ ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లో విడుదల చేయాలనీ చూస్తున్నారట దర్శక నిర్మాతలు. దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
NTR | Mahesh Babu : ఎన్టీఆర్ షోలో పాతిక లక్షలు గెలిచిన మహేష్ బాబు.. ప్రసారం ఎప్పుడంటే..
దృశ్యం2ను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.
దృశ్యం 2 చిత్ర బృందం షూటింగ్‌ను కేవలం 47 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. వెంకటేష్, మీనా జంటగా నటించారు. నదియా కీలకపాత్రలో కనిపించనుంది. మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమాతో పాటు వెంకటేష్ (Venkatesh) మరో సినిమాను కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ సూపర్ హిట్టైనా అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ నారప్ప (Narappa )పేరుతో రీమేక్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రియమణి కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా కరోనా కారణంగా ఆ మధ్య అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందింది.
ఇక వెంకటేష్ నటిస్తున్న మరో సినిమా ఎఫ్3 . ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎఫ్ 2కు సీక్వెల్‌గా వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తమన్నా, మెహ్రీన్, అంజలి ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.