Home /News /movies /

JATHI RATNALU ACTOR RAHUL RAMAKRISHNA SERIOUS WARNING TO HIS MOVIE HERO NAVEEN POLISHETTY PK

Naveen Polishetty - Rahul Ramakrishna: ‘జాతి రత్నాలు’ మధ్య గొడవ.. నవీన్ పొలిశెట్టిపై రాహుల్ వీరంగం..

జాతి రత్నాలు కలెక్షన్స్ (Jathi Ratnalu)

జాతి రత్నాలు కలెక్షన్స్ (Jathi Ratnalu)

Naveen Polishetty - Rahul Ramakrishna: జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు నవీన్ పొలిశెట్టి, రాహుల్, ప్రియదర్శి. ఈ ముగ్గురు కలిసి చేసిన వీరంగానికి రికార్డులు షేక్ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర జాతి రత్నాలు నిజంగానే మెరిసిపోతున్నారు.

ఇంకా చదవండి ...
జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు నవీన్ పొలిశెట్టి, రాహుల్, ప్రియదర్శి. ఈ ముగ్గురు కలిసి చేసిన వీరంగానికి రికార్డులు షేక్ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర జాతి రత్నాలు నిజంగానే మెరిసిపోతున్నారు. ఇప్పటికే 20 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చారు ఈ త్రిమూర్తులు. ఇదిలా ఉంటే ప్రమోషన్స్‌లో కూడా పిచ్చెక్కిస్తున్నారు జాతి రత్నాలు టీం. ఇప్పటికే 9 రోజుల్లో ఈ సినిమా 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దాంతో సక్సెస్ టూర్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే తాజాగా నవీన్, ప్రియదర్శి అమెరికాలో ఉన్నారు. అక్కడ మూడు రోజుల పాటు అన్ని చోట్లకు తిరుగుతున్నారు. అక్కడ్నుంచి వీడియోలు విడుదల చేస్తున్నారు. రోజూ అక్కడ చేసే రచ్చ, అల్లరిని పోస్ట్ చేస్తున్నారు. అవి కూడా వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రాహుల్ రామకృష్ణ ఓ వీడియో పోస్ట్ చేసాడు. ఏకంగా వార్నింగ్ ఇస్తూ వీడియో పెట్టాడు ఈయన. రాహుల్ పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అవుతుంది. అందులో ఆయన మాట్లాడుతూ.. అరేయ్‌ దర్శి, నవీన్‌.. పీపుల్స్‌ ప్లాజాలో సక్సెస్‌మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. విమానమెక్కి యూఎస్‌ వెళ్లిపోతారేరా.! నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా పాన్‌ కార్డ్‌ ఉందని. పాన్‌కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా..! జోగిపేట రవిరా నేను. నా వల్లే ప్రాబ్లమ్‌ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా! మీరు రండ్రా మీ సంగతి చెబుతా..! అంటూ వార్నింగ్ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ.

ఈ వీడియో సరదా కోసం చేసిందే అయినా కూడా బాగానే వైరల్ అవుతుంది. సినిమా ప్రమోషన్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు జాతి రత్నాలు టీం. పైగా దర్శకుడు కూడా అసలైన జాతిరత్నం. మనోడు కూడా సినిమా ప్రమోషన్ కోసం ఏదేదో చేస్తున్నాడు. నవీన్, రాహుల్ మధ్య గొడవ అంటూ సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jathi Ratnalu, Naveen Polishety, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు