Home /News /movies /

JATHI RATNALU 1ST WEEK COLLECTIONS NAVEEN POLISHETTY JATHI RATNALU MOVIE 1ST WEEK COLLECTIONS TA

Jathi Ratnalu 1st week collections: జాతి రత్నాలు మొదటి వారం కలెక్షన్లు.. ఆగని వసూళ్ల వర్షం..

 ‘జాతి రత్నాలు’ మూవీ (Twitter/Photo)

‘జాతి రత్నాలు’ మూవీ (Twitter/Photo)

Jathi Ratnalu 1st week collections: కరోనా లాక్‌డౌన్  తర్వాత థియేటర్స్‌ తెరుచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్స్ నడుపుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. మార్చి నెలలో విడుదలైన జాతిరత్నాలు మూవీ ఫస్ట్ వీక్ ఎంత వసూళ్లు సాధించిందటే..

ఇంకా చదవండి ...
    Jathi Ratnalu 1st week collections: కరోనా లాక్‌డౌన్  తర్వాత థియేటర్స్‌ తెరుచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్స్ నడుపుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రేక్షకులు కరోనాకు భయపడకుండా ఎంచక్కా థియేటర్స్‌కు వెళ్లి సినిమాలు చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వరస విజయాలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న ప్రేక్షకులు ఎలాంటి భయాలు లేకుండా థియేటర్స్‌కు వస్తున్నారు. ఈ యేడాది జనవరిలో ‘క్రాక్’మూవీతో మొదలైన కలెక్షన్ల ప్రభంజనం.. ఫిబ్రవరిలో ‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగిసింది.  ఆ తర్వాత మళ్లీ ‘జాతి రత్నాలు’ సినిమాతో థియేటర్స్ కళ కళ లాడుతున్నాయి. 

    ఈ చిత్రం సంచలనం విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టించారు జాతి రత్నాలు. ఈ గురవారంతో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలనే తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజులకు కలిపి ఈ సినిమాను రూ. 23.09 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 1.18 కోట్లు వసూళు చేసింది. ఇక విదేశాల్లో (ఓవర్సీస్)లో మాత్రం రూ. 3.43 కోట్లను రాబట్టింది. మొత్తంగా ఫస్ట్ వీక్ రూ. 27.70 కోట్ల షేర్ వసూళు చేసిన ఈ చిత్రం మొత్తంగా రూ. 46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ముందు ముందు రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటినా ఆశ్యర్యపోవాల్సిన  పనిలేదు. 
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jathi Ratnalu, Nag Ashwin, Naveen Polishety, Tollywood

    తదుపరి వార్తలు