• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JATHI RATHNALU SEQUEL TAKES OFF HERE ARE THE DETAILS SR

Jathi Ratnalu Sequel : మొదలైన జాతిరత్నాలు సీక్వెల్.. లీడ్ యాక్టర్స్ మారనున్నారా..

Jathi Ratnalu Sequel : మొదలైన జాతిరత్నాలు సీక్వెల్.. లీడ్ యాక్టర్స్ మారనున్నారా..

సెన్సేషనల్ జాతి రత్నాలుకు సీక్వెల్ Photo : Twitter

Jathi Ratnalu : నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్’టైనర్ జాతిరత్నాలు.

  • Share this:
    Jathi Ratnalu : నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్’టైనర్ జాతిరత్నాలు. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో విపరీతంగా ఆకట్టుకుంది. చెప్పాలంటే లాక్ డౌన్ తర్వాత విడుదలైన అన్ని సినిమాల కలెక్షన్స్‌ను తుడిచిపెట్టింది. సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండడంతో అందరూ.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇన్ని లాభాలను తెచ్చి పెట్టిన ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్నట్లు ప్రచారం అవ్వగా.. అది నిజం అని ఆ మధ్య ఈ సినిమా డైరెక్టర్ అనుదీప్ ప్రకటించారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. ఈ స్క్రిప్ట్ పనుల్లో డైరెక్టర్ అనుదీప్‌తో పాటు నిర్మాత దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి మరో సూపర్ కామెడీని తయారు చేసే పనిలో ఉన్నారట.

    ఇక ఈ సినిమా మొదటి పార్టు కొంత భాగం జోగిపేట, హైదరాబాద్‌లో జరగగా.. సెకండ్ పార్ట్ పూర్తిగా అమెరికాలో సాగనుందని తెలుస్తోంది. అమెరికా వెళ్లిన జాతిరత్నాలు ఎలా అక్కడ జీవనం సాగించారు అనే కోణంలో ఈ సినిమా సెకండ్ పార్ట్ ఉండనుందట. ఈ సెకండ్ పార్ట్‌ను కూడా నాగ్ అశ్వినే నిర్మించనున్నారు.

    ఇక ఈ సీక్వెల్‌లో లీడ్స్‌గా ఫస్ట్ పార్ట్‌లో ఉన్న నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మాత్రమే ఉండనున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. జాతిరత్నాలు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌‌లో స్ట్రీమ్ అవుతోంది. నాగ్ అశ్విన్ స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఈ నిర్మించగా.. ఈ సినిమాలో నవీన్‌కు జోడిగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‏గా చేసింది. వీరితో పాటు ఈ సినిమాలో కీర్తి సురేష్, విజయ్ దేవరకొండలు కూడా కనిపించి అలరించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు