Home /News /movies /

JATHI RATHNALU MOVIE SENSATION AT USA BOX OFFICE AND CREATING A RECORD MHN

Jathi Rathnalu: యు.ఎస్‌లో దుమ్ము రేపుతున్న ‘జాతిరత్నాలు’ కలెక్షన్స్.. చిన్న సినిమా పెద్ద రికార్డ్

Jathi Rathnalu movie sensation at USA box office and creating a record

Jathi Rathnalu movie sensation at USA box office and creating a record

Jathi Rathnalu: చిన్న సినిమాగా, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘జాతి రత్నాలు’ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుంది. ముఖ్యంగా యు.ఎస్‌లో కోవిడ్ తర్వాత మరే సినిమాకు రానంత కలెక్షన్స్ ఈ సినిమాకు వస్తుండటం విశేషం.

    అనుదీప్ కేవీ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ఫరియా అబ్దుల్లా నటీనటులుగా వచ్చిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘జాతిరత్నాలు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. టాక్ ఒక్కటే కాదండోయ్.. కలెక్షన్స్‌లో కూడా పెద్ద పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా దుమ్ములేపేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పేరుకే చిన్న సినిమా అయినా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ‘జాతిరత్నాలు’ దర్శకనిర్మాతలు కూడా ఊహించని రీతిలో కలెక్షన్లు కొట్టేస్తూ.. స్టార్ హీరోల మనసును కూడా కొల్లగొట్టేసింది.


    ఇప్పుడు ఎక్కడ చూసినా ‘జాతిరత్నాలు’ గురించే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఏ హీరో చూసినా ఈ సినిమా గురించే ట్వీట్, ప్రశంసల వర్షమే కురిపిస్తున్నారు. అలా అందరి మన్ననలు పొందిన ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు యూఎస్‌లో కూడా ఇంతకు ముందేన్నడూ చూడని కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషమని చెప్పుకోవచ్చు. చెప్పుకోవడానికి చిన్న సినిమా అయినా కలెక్షన్లు మాత్రం భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా వీకెండ్‌ను చాలా బాగా ఉపయోగించుకున్న ఈ సినిమా పెద్ద పెద్ద ఘనతలే అందుకుంటోందని చెప్పుకోవచ్చు.


    యూఎస్‌లో దుమ్ములేపుతున్న ఈ చిన్న సినిమా ఇప్పుడు పెద్ద రికార్డే తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పీడ కాస్త విరగడైన తర్వాత ‘జాతిరత్నాలు’ హాప్ మిలియన్ డాలర్ వసూళ్లను సాధించింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయమే. మరీ ముఖ్యంగా ఇలయదళపతి విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాస్టర్’ మూవీకి నాలుగు లక్షల నలబై వేల డాలర్స్ వచ్చాయ్. అయితే ఈ రికార్డ్‌ను ‘జాతిరత్నాలు’ క్రాస్ చేసేసింది. అది కూడా అతి కొద్దిరోజుల్లోనే స్టార్ హీరో చిత్రాన్నే క్రాస్ చేసిందంటే మున్ముంథు కూడా రికార్డ్‌లు బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేదమో.


    ఇవన్నీ అటుంచితే.. నిన్న మొన్నటి వరకూ థియేటర్లలో దుమ్ములేపిన ‘ఉప్పెన’ను కూడా ‘జాతిరత్నాలు’ క్రాస్ చేసేయడం మరో రికార్డే అని చెప్పుకోవాలి. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే వచ్చిన ఈ చిత్రం ఈ రేంజ్‌లో కాసుల వర్షం కురిపిస్తుండటంతో దర్శక నిర్మాతలు కూడా ఆశ్చర్యపోతన్నారట. మొత్తానికి చూస్తే.. మన చిన్న తెలుగు సినిమా ‘జాతిరత్నాలు’ రెండు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్‌లో కలెక్షన్లతో మెరిసిపోతున్నాయన్న మాట.

    Published by:Anil
    First published:

    Tags: Jathi Ratnalu, Naveen Polishety, Priyadarshi

    తదుపరి వార్తలు