ప్రభాస్ ఇంటికి జపాన్ ముద్దుగుమ్మలు... ఏం చేశారంటే..

ప్రభాస్ ఇంటి ముందుకు వెళ్లి సందడి చేశారు. పాపం ప్రభాస్ పై ఉన్న అభిమానంతో... మిస్టర్ ఫర్ ఫెక్ట్‌ను కలవాలని చాలా హైదరాబాద్ లోని ప్రభాస్ ఇంటికి వెళ్లారు.

news18-telugu
Updated: June 11, 2019, 1:51 PM IST
ప్రభాస్ ఇంటికి జపాన్ ముద్దుగుమ్మలు... ఏం చేశారంటే..
ప్రభాస్ ఇంటి ముందు జపాన్ భామల సందడి
  • Share this:
‘బాహుబలి’ ఈ సినిమాతో ప్రభాస్‌కు దేశంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ అంటే చాలామంది అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు. ఒక్కసారైన ప్రభాస్‌ను కలవాలనుకుంటారు. ఫోటో దిగాలని చాలామంది కలలు కంటుంటారు. అయితే ఇదే తరహాలో జపాన్‌లో కూడా మన డార్లింగ్‌కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. "బాహుబ‌లి" సినిమా జపాన్ లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఆ దేశంలో ప్రభాస్ కు ఎంతో మంది అభిమానులు తయారయ్యారు. అందులోనూ అమ్మాయిలే ఎక్కువమంది. అందుకే ‘బాహుబలి’ సినిమా రిలీజ్ అయిన సమయంలో ప్రభాస్, అనుష్కలు జపాన్ కు కూడా వెళ్లి వచ్చారు.

అయితే తాజాగా కొందరు జపాన్ ముద్దుగుమ్మలు ప్రభాస్ కోసం ఇండియాకు వచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న అమరేంద్ర బాహుబలి ఇంటికి చేరుకున్నారు. ప్రభాస్ ఇంటి ముందుకు వెళ్లి సందడి చేశారు. పాపం ప్రభాస్ పై ఉన్న అభిమానంతో... మిస్టర్ ఫర్ ఫెక్ట్‌ను కలవాలని చాలా హైదరాబాద్ లోని ప్రభాస్ ఇంటికి వెళ్లారు. అయితే, 'సాహో' షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా ప్రభాస్ వారిని కలుసుకోలేకపోయాడు. దీంతో తమ అభిమానాన్ని చూపుతూ వారంతా ప్రభాస్ ఇంటి గేటు ముందు డాన్సులు వేసి సందడి చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>