Home /News /movies /

JANUARY MONTH MOVIES REVIEW 2021 TRADE DETAILS HERE MHN

January Movies Review: జనవరి విడుదలైన సినిమాల్లో హిట్స్.. ఫ్లాపులు

January month Movies review 2021 trade details here

January month Movies review 2021 trade details here

January Movies Review: కోవిడ్ నేపథ్యంలో జనవరి నెలలో విడుదలైన సినిమాలెన్ని, అందులో సక్సెస్ అయినవి ఎన్ని, ఫెయిల్యూర్ అయినవి ఎన్ని అనే వివరాలు మీకోసం..

    2020లో కోవిడ్ ప్రభావంతో చాలా రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అలాంటి వాటిలో సినీ పరిశ్రమ కూడా ఒకటి. సినిమా షూటింగ్స్ ఆగిపోవడమే కాదు.. థియేటర్స్ కూడా మూతపడ్డాయి. దాదాపు ఆరేడు నెల‌లు సినీ ప‌రిశ్ర‌మ ప‌నిలేకుండా కామ్‌గా ఉండిపోయింది. ఇక థియేట‌ర్స్ ప‌రిస్థితి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సినిమా షూటింగ్స్‌కు అనుమ‌త‌లు వ‌చ్చినా థియేట‌ర్స్ విష‌యంలో కొన్నాళ్లు వేచి చూసిన ప్ర‌భుత్వం ముందుగా యాభై శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తి ఇస్తూ సినిమాల రిలీజ్‌ల‌కు అనుమ‌త‌లు ఇచ్చింది. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేట‌ర్స్ ర‌న్ అవుతున్నాయి. అయితే డిసెంబ‌ర్‌లో యాబై శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్‌ను ఓపెన్ చేసిన‌ప్పుడు సోలో బ్ర‌తుకే సోబెట‌ర్ వంటి సినిమాల‌తో పాటు కొన్ని చిన్నా చిత‌కా సినిమాలు థియేట‌ర్స్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి.

    అయితే అస‌లు ప‌రీక్ష జ‌న‌వ‌రిలోనే ప్రారంభ‌మైంది. నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌కు ఎంతో ముఖ్య‌మైన సంక్రాంతి వ‌చ్చింది. సినిమాలు సిద్ధ‌మైయ్యాయి. వంద శాతం ఆక్యుపెన్సీకి రిక్వెస్ట్ పెట్టినా ప‌నులు జ‌ర‌గ‌లేదు. దీంతో యాబై శాతంలో సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. జ‌న‌వ‌రి నెల‌లో మొత్తం 27 సినిమాలు విడుద‌ల‌య్యాయి. అందులో 21 సినిమాలు స్ట్ర‌యిట్ సినిమాలు కాగా.. 6 సినిమాలు డ‌బ్బింగ్ సినిమాలు. బ్లాక్ బస్టర్ ఆఫ్ జనవరిగా క్రాక్ నిలిస్తే.. డిజాస్టర్ ఆఫ్ జనవరిగా అల్లుడు అదుర్స్ అట్టడుగున నిలిచింది.

    వీటిలో క్రాక్‌, రెడ్‌, మాస్ట‌ర్‌, అల్లుడు అదుర్స్ చిత్రాలు కాస్త హైప్ మీద థియేట‌ర్స్‌లో సంక్రాంతికి పోటీ ప‌డ్డాయి. ర‌వితేజ న‌టించిన క్రాక్ త‌న స‌త్తా చాటుకుని బాక్సాఫీస్ వ‌ద్ద విన్న‌ర్‌గా నిలిచాడు. సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కాగా.. రెడ్‌, మాస్ట‌ర్ సినిమాలు హిట్ కోవ‌లో నిలిచాయి. ఇక అల్లుడు అదుర్స్ డిజాస్ట‌ర్‌గా మారింది. వీటిలో మాస్ట‌ర్ డ‌బ్బింగ్ సినిమా కేట‌గిరిలోకి వెళుతుంది. మిగిలిన సినిమాల‌న్నీ వ‌చ్చామా.. వెళ్లామా అన్న‌ట్లుగా వెళ్లిపోయాయి.
    Published by:Anil
    First published:

    Tags: Alludu Adhurs, Krack, Master, RED Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు