జాని మాస్టర్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు, డాన్స్ లవర్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు..! క్లాస్.. ఊర మాస్.. డాన్స్ కొరియా కొరియాగ్రఫీతో అందరికీ దగ్గరయ్యాడు జానీ మాస్టర్. ఈయన డాన్స్ కంపోజింగ్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ ఎంతటి బీభత్సం సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ పాటకు డాన్స్ కంపోజింగ్ చేసింది జానీ మాస్టరే. అది యూబ్యూట్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. అంతేకాదు అల వైకుంఠపురంలోని బుట్ట బొమ్మ సాంగ్..ఖైదీ 150 సుందరి పాటకు కూడా జానీ మాస్టరే స్టెప్పులు వేయించాడు. ఇలా ఎన్నో హిట్ సాంగ్స్‌కు డాన్స్ కంపోజ్ చేసి.. టాలీవుడ్లో బెస్ట్ కొరియోగ్రాఫర్స్‌లో ఒకడిగా ఉన్నాడు జానీ మాస్టర్.
అలాంటి జానీ మాస్టర్ బుల్లి తెరపై కూడా సందడి చేస్తుంటాడు. జీ తెలుగులో ప్రసారమయ్యే.. 'బొమ్మ అదిరింది' కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఈటీవీ, మా టీవీల్లో వచ్చే పలు ప్రత్యేక కార్యక్రమాలకు గెస్ట్‌గా వెళ్తుంటాడు. ఐతే తాజాగా జానీ మాస్టర్ లేడీ గెటప్ వేశాడు. అసలు ఇంతకు ముందెప్పుడూ ఎవరూ చూడని గెటప్‌లో సందడి చేశాడు. దసరా పండగ సందర్భంగా జీ తెలుగులో 'చి. ప్రదీప్‌కు చిలసౌ శ్రీముఖి ప్రేమతో నమస్కరించి రాయునది ఏమనగా..' అనే కార్యక్రమం ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు టీమ్ విడుదల చేసింది. అందులో జానీ మాస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఢీ డాన్స్ షో ఫేమ్ పండు అందరికీ సుపరిచితమే. అతడితో కలిసి దసరా స్పెషల్ ఈవెంట్లో సందడి చేశాడు జానీ మాస్టర్. టిక్ టాక్ దుర్గా రావు సాంగ్ ఎంత ఫేమస్ అయిందో.. పండు లేడీ గెటప్ కూడా అంతకు మించి పేరు సంపాదించింది. ఈ క్రమంలోనే మరో లేడీ గెటప్ వేసిన పండు.. ఈసారి జానీ మాస్టర్‌ను కూడా మార్చేశాడు. ఇద్దరు కలిసి చోలీకే పీచే క్యాహె సాంగ్‌కు అద్దిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్‌తో స్టెప్పులేసి అలరించారు. ఐతే తాను లేడీ గెటప్ వేయడానికి ఓ బలమైన కారణం ఉందని చెప్పాడు జానీ. తాను డాన్స్ కంపోజ్ చేేసే సమయంలో.. అమ్మాయిలు మేకప్ రూమ్ నుంచి లేట్‌గా వస్తారని, అలాంటి సందర్భాల్లో తాను కోప్పడే వాడినని తెలిపాడు. అసలు వారు ఎందుకు ఆలస్యంగా వస్తారో తెలుసుకున్నానని.. లేడీ గెటప్‌లు వేయడం ఎంతో కష్టమని పేర్కొన్నాడు. నిజంగా మహిళా ఆర్టిస్టులు చాలా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపించాడు జానీ.
ఈ దసరా కి మిమల్ని అలరించడానికి మీ ముందుకు వస్తుంది 🤩🤩
కాగా, 'చి ప్రదీప్‌కు చిలసౌ శ్రీముఖి నమస్కరించి రాయునది ఏమనగా..' కార్యక్రమంలో నాగబాబుతో పాటు అనసూయ, శ్రీముఖి, ప్రదీప్, నిహారిక, పండు, బొమ్మ అదిరింది కమెడియన్స్ ధన్ రాజ్, వేణు, సద్దాం, చంద్ర సందడి చేశారు. చివర్లో గల్వాన్ లోయ ఘర్షణలో వీరమరణం చెందిన కల్నల్ సంతోష్ బాబుకు ఘనంగా నివాళి అర్పించారు. దసరా పండగ రోజు ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.