జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. హీరో అతడే..

Janhvi Kapoor tollywood entry : జాన్వీ కపూర్‌.. తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటనతో అదరగొట్టి..  ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. ఇది అలా ఉంటే జాన్వీ పూరీ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా సౌత్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దంమవుతోందని సమాచారం.

news18-telugu
Updated: October 24, 2019, 8:59 AM IST
జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. హీరో అతడే..
Instagram
  • Share this:
తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటనతో అదరగొట్టి..  ప్రేక్షకుల మనసు గెలుచుకుంది జాన్వీ కపూర్‌. మరాఠిలో సూపర్ హిట్ అయిన 'సైరత్‌'‌‌కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను  ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించారు.  ప్రస్తుతం జాన్వీ..  ‘కార్గిల్‌ గాళ్‌', 'రూహ్ అఫ్జా', 'తక్త్‌’ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. ఇది అలా ఉండగా జాన్వీ సౌత్‌లో నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ బ్యూటీని టాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసుకున్నారని టాక్. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్‌'తో సూపర్‌ హిట్ అందుకున్న పూరి, తన నెక్ట్స్ సినిమాను విజయ్‌ దేవరకొండతో  ‘ఫైటర్’ సినిమా  చేస్తున్నాడు. ఈ సినిమాతోనే జాన్వీ.. హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.

Vijay Devarakonda to follow Pawan Kalyan and Ravi Teja in his new movie Fighter with Puri Jagannadh pk అవును.. ఇప్పుడు నిజంగానే విజయ్ ఇదే చేయబోతున్నాడు. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు కనిపించినా కూడా వరస సినిమాలు అయితే చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. vijay devarakonda,puri jagannadh,vijay devarakonda fighter movie,vijay devarakonda martial arts,vijay devarakonda janhvi kapoor,vijay devarakonda pawan kalyan,vijay devarakonda ravi teja,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేరవకొండ పూరీ జగన్నాథ్,విజయ్ దేవరకొండ జాన్వీ కపూర్,విజయ్ దేవరకొండ పవన్ కల్యాణ్ రవితేజ,
విజయ్ దేవరకొండ జాన్వీ కపూర్ (Source: Twitter)


దీనికి తోడు జాన్వీ  కపూర్ కూడా గతంలో సౌత్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా జాన్వీ తెలుగులో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ నిజం కాలేదు. ఇప్పుడు మరోసారి విజయ్‌తో జాన్వీ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక శ్రీదేవి కూడా తెలుగు సినిమాల్లో నటించే నార్త్‌లో పాగా వేసింది. తాజాగా జాన్వీ కపూర్ కూడా తండ్రి బాటలో సౌత్‌లో నటించడానికి రెడీ అవుతోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 24, 2019, 8:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading