పూరీ డైరెక్షన్‌లో శ్రీదేవి కూతురు.. ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న జాన్వీ..

Photo : Instagram.com/janhvikapoor/

Janhvi Kapoor tollywood entry : జాన్వీ కపూర్‌.. తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటనతో అదరగొట్టి..  ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. ఇది అలా ఉంటే జాన్వీ పూరీ డైరెక్షన్‌లో సౌత్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దంమవుతోందని సమాచారం.

 • Share this:
  Janhvi Kapoor : జాన్వీ కపూర్‌.. తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటనతో అదరగొట్టి..  ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. మరాఠిలో సూపర్ హిట్ అయిన 'సైరాత్‌'‌‌కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను  ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించారు.  ప్రస్తుతం జాన్వీ..  ‘కార్గిల్‌ గాళ్‌', 'రుహీ అఫ్జా', 'తక్త్‌’ సినిమాలతో  హిందీలో బీజీగా గడుపుతోంది. ఇది అలా ఉండగా జాన్వీ సౌత్‌లో నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ బ్యూటీని టాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసుకున్నారని టాక్. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్‌'తో సూపర్‌ హిట్ అందుకున్న పూరి, తన నెక్ట్స్ సినిమాను విజయ్‌ దేవరకొండతో చేస్తున్నాడు. ఇదే విషయాన్ని నిర్మాత చార్మీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.   
  View this post on Instagram
   

  Missing this hurrr 💇🏻‍♀️🥺


  A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

  కాగా.. ఈ సినిమా ద్వారా పూరీ.. జాన్వీని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేయనున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే దీనికి తోడు జాన్వీ కూడా గతంలో సౌత్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన  సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా జాన్వీ తెలుగులో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ నిజం కాలేదు. ఇప్పుడు మరోసారి విజయ్‌తో జాన్వీ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే ఈ విషయంపై పూరి  స్పందించాల్సిందే.
  First published: