జాన్వీ చేసిన పనిని ఏకిపారేస్తున్న నెటిజన్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

జాన్వీ కపూర్ (Instagram/Photo)

సెలబ్రిటీల స్థానంలో ఉన్న వాళ్లు ఏమి చేసినా వార్తే. ఒక్కోసారి వాళ్లు అనుకోకుండా చేసే పనులు వాళ్లని ఇబ్బందుల పాలు చేస్తాయి. తాజాగా దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.. తాజాగా తాను చేసిన పనికి నెట్టింట్లో ట్రోల్స్‌కు గురువుతోంది.

  • Share this:
    సెలబ్రిటీల స్థానంలో ఉన్న వాళ్లు ఏమి చేసినా వార్తే. ఒక్కోసారి వాళ్లు అనుకోకుండా చేసే పనులు వాళ్లని ఇబ్బందుల పాలు చేస్తాయి. తాజాగా దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.. తాజాగా తాను చేసిన పనికి నెట్టింట్లో ట్రోల్స్‌కు గురువుతోంది. 22 ఏళ్ల ఈ భామ ఓ పని నిమిత్తం బయటకు వచ్చింది. ఈ సందర్భంగా జాన్వీ పసుపు కలర్ పంజాబీ డ్రెస్ వేసుకుంది. ఇందులో భాగంగా ఆమె దుపట్టాకు ఉన్న ప్రైస్ ట్యాగ్‌ను రిమూవ్ చేయకుండానే బయటకు వచ్చేసింది. ఆమె ప్రైస్ ట్యాగ్ తీయని ఈ డ్రెస్‌తో ఉన్న జాన్వీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.    ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన జాన్వీకపూర్.. ప్రస్తుతం సినిమాల కంటే తన యాటిట్యూడ్‌తో వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం జాన్వీ..  ‘కార్గిల్‌ గాళ్‌', 'రూహ్ అఫ్జా', 'తక్త్‌’ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. వీటితో పాటు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: