టాలీవుడ్‌లోకి శ్రీదేవి కూతురు... రెమ్యూనరేషన్‌పై చర్చలు ?

గతంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, అఖిల్ సినిమాల్లో జాన్వీ నటిస్తుందనే టాక్ వినిపించినా... అవన్నీ రూమర్స్ అని ఆ తరువాత క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా జాన్వీని టాలీవుడ్‌లోకి తీసుకొచ్చేందుకు సీరియస్‌గా ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: August 29, 2019, 3:20 PM IST
టాలీవుడ్‌లోకి శ్రీదేవి కూతురు... రెమ్యూనరేషన్‌పై చర్చలు ?
జాన్వీ కపూర్ (Instagram/Photo)
  • Share this:
బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ స్టార్ హీరోయిన్ రేంజ్‌ను ఎంజాయ్ చేసింది దివంగత అందాల నటి శ్రీదేవి. అందుకే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మారిందన్న న్యూస్ వినగానే... ఆమె తెలుగులో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందని టాలీవుడ్ మూవీ లవర్స్ చర్చించుకోవడం మొదలుపెట్టారు. బాలీవుడ్ భామలంతా ఏదో ఒక సినిమాతో తెలుగులో అడుగుపెడుతుండటంతో... శ్రీదేవి కూతురు జాన్వీ కూడా ఏదో రోజు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అనుకున్నారు. గతంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, అఖిల్ సినిమాల్లో జాన్వీ నటిస్తుందనే టాక్ వినిపించినా... అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది.

అయితే తాజాగా జాన్వీని టాలీవుడ్‌లోకి తీసుకొచ్చేందుకు సీరియస్‌గా ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు పూరి జగన్నాధ్... తన నెక్ట్స్ మూవీని విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీని తీసుకోవాలని పూరి భావిస్తున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి శ్రీదేవి కూతురుతో చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.

Vijay Devarakonda to follow Pawan Kalyan and Ravi Teja in his new movie Fighter with Puri Jagannadh pk అవును.. ఇప్పుడు నిజంగానే విజయ్ ఇదే చేయబోతున్నాడు. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు కనిపించినా కూడా వరస సినిమాలు అయితే చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. vijay devarakonda,puri jagannadh,vijay devarakonda fighter movie,vijay devarakonda martial arts,vijay devarakonda janhvi kapoor,vijay devarakonda pawan kalyan,vijay devarakonda ravi teja,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేరవకొండ పూరీ జగన్నాథ్,విజయ్ దేవరకొండ జాన్వీ కపూర్,విజయ్ దేవరకొండ పవన్ కల్యాణ్ రవితేజ,
Photo : విజయ్ దేవరకొండ Twitter.com/Charmmeofficial


తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు సుముఖంగా ఉన్న జాన్వీ... రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కొండెక్కి కూర్చుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ఏకంగా జాన్వీ రూ. 5 కోట్లు అడిగినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే రెమ్యూనరేషన్ విషయంలో జాన్వీతో ఛార్మి చర్చలు జరుపుతోందన్నది లేటెస్ట్ న్యూస్. ఏదేమైనా... పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ నటిస్తే...ఆ సినిమా టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా మారుతుందనడంలో సందేహం లేదు.
Published by: Kishore Akkaladevi
First published: August 29, 2019, 3:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading