సమంత బాటలో జాన్వీ కపూర్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

జాన్వీ కపూర్ హిందీ సినిమాల్లో నటిస్తూనే డిజిటల్‌లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది.

news18-telugu
Updated: November 28, 2019, 5:24 PM IST
సమంత బాటలో జాన్వీ కపూర్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
Instagram
  • Share this:
ప్రస్తుతం వినోద రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దీనికి తోడు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికి అందుబాటు ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ డిజిటల్ కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి. అందులో భాగంగానే ఇండియాలో ప్రస్తుతం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు మంచి ఆదరణ పొందుతున్నాయి. అంతేకాదు.. ఈ సంస్థలు సొంతంగా కాంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటినే మనం ఒరిజనల్స్‌గా పిలుస్తున్నాము. ఈ ఒరిజనల్స్‌లో మన ఇండియాకు సంబందించిన కథ కథనాలు, ఇక్కడి నటినటీమణులు నటిస్తూ అలరిస్తున్నారు.  హిందీలో కియారా నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్‌లు చేస్తూ అటూ డిజిటల్‌లో ఇటూ సినిమాల్లో మంచి అవకాశాలు పొందుతున్నారు. 

View this post on Instagram
 

I'll be bringing the winter chill to your spine on January 1st 2020 only on Netflix. Four thrilling stories coming your way! #GhostStories


A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

తెలుగులో కూడా ఇలాంటీ కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది. ఆ మధ్య జగ్గుబాయ్ అమెజాన్ వెబ్ సీరిస్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ సమంత కూడా అమెజాన్ ప్రైమ్ వెబ్‌సిరీస్‌.. ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2లో నటిస్తోంది. అయితే సినిమాలతో పోల్చితే.. డిజిటల్‌లో కంటెంట్‌ను అనుకున్న విధంగా.. చెప్పడమే కాకుండా.. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.. దీంతో హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. ఇటు డైరెక్టర్స్ కూడా డిజిటల్ బాట పడుతున్నారు. తాజాగా  హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. అది అలా ఉంటే హిందీ హీరోయిన్ జాన్వీ కూడా ఓ వెబ్ సిరీస్  చేస్తోంది. జోయా అక్తర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో జనవరి ఒకటి నుండి ప్రసారం కానుంది. ఇదే విషయాన్ని జాన్వీ తన సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ.. జనవరి ఫస్ట్ మిడ్ నైట్ నుండి ఈ ఘోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌ను స్ట్రీమ్ చేయవచ్చని తెలిపింది. ఇదే కొత్త సంవత్సరానికి జాన్వీ ఇచ్చే గిఫ్ట్ అని అంటోంది.

కేక పెట్టిస్తోన్న పునర్నవి లేటెస్ట్ ఫోటో షూట్..


First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు