Home /News /movies /

Janhvi Kapoor: నా ప్రతిభ అందుకు సరిపోదనే అమ్మ నన్ను సినిమాల్లోకి పంపింది.. జాన్వీ కపూర్!

Janhvi Kapoor: నా ప్రతిభ అందుకు సరిపోదనే అమ్మ నన్ను సినిమాల్లోకి పంపింది.. జాన్వీ కపూర్!

Janhvi Kapoor

Janhvi Kapoor

Janhvi Kapoor: అతిలోక సుందరి అందాల తార తెలుగు సినీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

    Janhvi Kapoor: అతిలోక సుందరి అందాల తార తెలుగు సినీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉంది. జాన్వీ తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. తన తల్లి గురించి పలుమార్లు అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా తన తల్లి చెప్పిన మాటలు గురించి కొన్ని విషయాలు పంచుకుంది జాన్వీకపూర్.

    ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా.. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు తమ తల్లుల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీకపూర్.. ఈ లోకం నుండి దూరమైన శ్రీదేవి.. ఇప్పటికీ అభిమానుల మనసులో నిలిచే ఉంది. ఇక తన తల్లి శ్రీదేవి తనను డాక్టర్ గా చూడాలని కలలు కనేదట. తాను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఇదే విషయాన్ని చెప్పేదట‌. కానీ తను సినీ వాతావరణంలో పెరిగానని, బాల్యం నుంచే నటనపై ఆసక్తి కలిగిందని తెలిపింది.

    ఇక తనకు ఉన్న ప్రతిభ వైద్య వృత్తికి సరిపోదని తేలిపోయిందని తన తల్లికి తెలిపిందట‌. ఇక తన మాటను కాదనకుండా తన తల్లి శ్రీదేవి కూడా చివరకు తనను సినిమాలోకి పంపడానికి ఒప్పుకుందని తెలిపింది. కానీ తను డాక్టర్ కావాలన్న తన తల్లి కోరిక తీర్చే లేకపోయానని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. ఇక జాన్వీకపూర్ సోషల్ మీడియాలో తన బికినీ అందాలతో, గ్లామర్ లుక్ లతో ఫోటోలకు ఫోజ్ ఇస్తూ అభిమానులతో నిత్యం ఆ ఫోటోలను పంచుకుంటూనే ఉంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Janhvi kapoor posts, Khushi janhvi, Khushi Kapoor, Khushi kapoor instagram, Mothers day, Mothers Day 2021, Sridevi, Sridevi pics

    తదుపరి వార్తలు