శ్రీదేవి ముద్దుల తనయ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ సినిమా చిత్రీకరణలో బిజీ బిజీగా ఉంది. లేటెస్ట్గా ఈ సినిమా సెట్స్ నుంచి జాన్వీకపూర్ షేర్ చేసిన ఫొటోలు ఆమె ఫ్యాన్స్‌ను నెటిజన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అయితే వీటితో పాటు ఆమె షేర్ వీడియో మరింత వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా? జాన్వీ కపూర్ ఈ ఆటోరిక్షాను నడపడింది.
View this post on Instagram
అసలు ఇంతకీ జాన్వీ కపూర్ ఈ ఆటోరిక్షాను ఎందుకు నడిపింది? అనే వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుడ్ లక్ జెర్రీ సినిమాలో జాన్వీ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఉత్తరాదిన పలు లొకేషన్స్‌లో చిత్రీకరణను జరుపుకుంటోంది. అందులో భాగంగా పంజాబ్‌లో చిత్రీకరణను జరుపుకుంటోంది.
View this post on Instagram
అయితే రీసెంట్గా ఉత్తరాదిన జరుగుతున్న రైతుల ఉద్యమం కారణంగా సినిమా షూటింగ్ ఆగింది. అయితే అప్పటికే ఆ లొకేషన్లో ఉన్న జ్ఞాపకాలను జాన్వీకపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటూ వస్తుంది.
View this post on Instagram
అందులో భాగంగాన కొన్ని ఫొటోలు, తాను ఆటో రిక్షాను తోలిన వీడియోను షేర్ చేసింది జాన్వీకపూర్. ఆటోలో జాన్వీకపూర్ అసిస్టెంట్స్ ఎవరూ ఇద్దరు కూర్చుని మమ్మల్ని కాపాడండి అని అరుస్తున్నారు.
View this post on Instagram
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో బిజీగా ఉండే జాన్వీకపూర్ సినిమాలకు సంబంధించిన ఫొటోలు, సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి ఫొటోలు, తన డాన్సింగ్ వీడియోలు షేర్ చేస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే గుడ్ లక్ జెర్రీ చిత్రీకరణలో ఉన్న జాన్వీకపూర్ ఈ ఏడాది దోస్తానా 2, రూహీ అఫ్జాన చిత్రాలతో సందడి చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Janhvi Kapoor