జాన్వీ కపూర్‌ సౌత్‌ ఎంట్రీ.. ఆ హీరోతోనేనా...

జాన్వీ కపూర్ Photo : Instagram.com/janhvikapoor

Janhvi Kapoor south entry : జాన్వీ కపూర్‌.. తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటనతో అదరగొట్టి..  ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. ఇది అలా ఉంటే జాన్వీ ఓ సూపర్ స్టార్‌తో సౌత్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దంమవుతోందని తెలుస్తోంది.

 • Share this:
  Janhvi Kapoor : జాన్వీ కపూర్‌.. తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటనతో అదరగొట్టి..  ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన 'సైరాత్‌'కు రీమేక్.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ..  ‘కార్గిల్‌ గాళ్‌', 'రుహీ అఫ్జా', 'తక్త్‌’ సినిమాలతో బాలీవుడ్‌లో సూపర్ బీజీగా గడుపుతోంది. ఇది అలా ఉండగా జాన్వీ సౌత్‌లో నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. జాన్వీ తండ్రి బోనీకపూర్‌ నిర్మాతగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా ఓ యాక్షన్‌ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్‌‌‌కు వెళ్లనుంది. అయితే ఈ  యాక్షన్ సినిమాలో ఓ కీలక పాత్రలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల మాట.   
  View this post on Instagram
   

  Peaches and cream 🍦


  A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

  అజిత్ ప్రస్తుతం ‘నెర్కొండ పార్వాయి’  అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా 'పింక్'  అనే హిందీ సినిమాకు రీమేక్ . ఈ సినిమాను కూడా బోనీ కపూరే నిర్మిస్తున్నారు. ‘నెర్కొండ పార్వాయి’  ఈ నెల 10 విడుదలకు సిద్దమవుతోంది. అయితే ఇంతకు ముందు కూడా జాన్వీ  ‘మానాడు' (తమిళ్ సినిమా), 'RRR’ సినిమాలతో సౌత్‌ ఎంట్రీ ఇస్తుందని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

   
  Published by:Suresh Rachamalla
  First published: