తిరుపతిలోనే తన పెళ్లి అంటున్న జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ హాట్ షో

తన పెళ్లి సంప్రదాయ పద్దతిలో తిరుపతిలో జరుగుతుందని చెప్పేసింది జాన్వీ. అంతేకాదు తన పెళ్లిలో సంప్రదాయ కంజీవరమ్ చీరను ధరిస్తానంది.

  • Share this:
    ‘ధడక్’సినిమాతో అందరి మనసుల్ని దోచుకున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. తన పెళ్లికి సంబంధించిన చాలా విషయాల్ని బయటకు చెప్పింది. ఓ మ్యాగజైన్‌‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. తన పెళ్లి విషయంలో తన తల్లి శ్రీదేవితో మట్లాడానంది జాన్వీ. అయితే మగవాళ్ల విషయంలో తన తీర్పుపై అమ్మకు నమ్మకం లేదని చెప్పుకొచ్చింది. శ్రీదేవియే ఎవరో ఒకరిని ఎంపిక చేయాలనుకునేది. తాను పెళ్లాడబోయే వ్యక్తికి కూడా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలిపింది జాన్వీ కపూర్ . తనకు కాబోయే జీవిత భాగస్వామి దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకునేలా ఉండాలంది. మంచి టాలెంట్ కూడా అతనికి ఉండాలని తెలిపింది. తను చేసే పని పట్ల అతనికి కూడా అంకితభావం ఉండాలని పేర్కొంది.

    అంతేకాకుండా అందరిని నవ్వించే స్వభావం ఉన్నవ్యక్తి కూడా అయి ఉండాలని కండిషన్లు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తన పెళ్లి సంప్రదాయ పద్దతిలో తిరుపతిలో జరుగుతుందని చెప్పేసింది జాన్వీ. అంతేకాదు తన పెళ్లిలో సంప్రదాయ కంజీవరమ్ చీరను ధరిస్తా. మొత్తం దక్షిణాది వంటకాలతో తనపెళ్లి వేడుక ఉంటుందని చెప్పుకొచ్చింది జాన్వీ. ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. గుంజన్ సక్సేనా'తో పాటు, రుహి అఫ్జా,'తఖ్త్, దోస్తానా 2 సినిమాల్లో జాన్వీ నటిస్తోంది. 'గుంజన్ సక్సేనా' 2020 మార్చిలో విడుదల కానుంది.
    Published by:Sulthana Begum Shaik
    First published: