హోమ్ /వార్తలు /సినిమా /

Janhvi Kapoor | శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కి భారీ షాక్.. ఏదో అనుకుంటే..

Janhvi Kapoor | శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కి భారీ షాక్.. ఏదో అనుకుంటే..

గుంజన్ సక్సేనా సినిమాలో జాన్వీ కపూర్ (Image;ANI)

గుంజన్ సక్సేనా సినిమాలో జాన్వీ కపూర్ (Image;ANI)

Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటించిన గుంజన్ సక్సేసా సినిమా మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం తెలిపింది.

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటించిన గుంజన్ సక్సేసా సినిమా మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం తెలిపింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది. ఎయిర్ ఫోర్స్ మీద నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. అలాగే లేఖను నెట్ ఫ్లిక్స్, ధర్మ ప్రొడక్షన్ హౌస్‌కు కూడా పంపింది. గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గర్ల్ అనే సినిమాను తీస్తున్నప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గౌరవ మర్యాదలు పెంచేలా తీస్తామని, అలాగే భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా ఉండేలా తీస్తామని చెప్పారని, కానీ, ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ చూస్తుంటే అందులో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమ దృష్టికి వచ్చిందని, తాము పరిశీలించగా అలాగే తోచిందంటూ ఆ లేఖలో ఐఏఎఫ్ పేర్కొంది. గుంజన్ సక్సేనా క్యారెక్టర్‌‌కి భారీ హైప్ తీసుకురావడం కోసం ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ఐఏఎఫ్‌ మీద నెగిటివ్ ప్రభావం వచ్చేలా తీసిందని అభ్యంతరం తెలిపినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. ఈ సినిమాలో లింగ భేదాన్ని చూపే సన్నివేశాలు ఉన్నాయని (ఎయిర్ ఫోర్స్ ఆఫీసులో మొదట్లో మగవారి టాయిలెట్స్ ఉండేవి. ఆమె లేడీస్ టాయిలెట్ కోసం వెతుకుతున్నట్టు ట్రైలర్‌లో సీన్‌, డైలాగ్ ఉన్నాయి) అభిప్రాయపడింది. ఆ సన్నివేశాన్ని డిలీట్ చేయడమో లేకపోతే మార్చడమో చేయాలని సూచించింది. ఐఏఎఫ్ గురించి అవాస్తవాలు మాత్రం ప్రసారంచేయొద్దని స్పష్టంచేసింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మొట్టమొదటి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా. ఆమె జీవిత కథ ఆధారంగా గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గర్ల్ అని సినిమాను తీశారు. 1999లో జరిగిన కార్గిల్ వార్‌లో ఆమె కూడా పాల్గొన్నారు. యుద్ధంలో కాల్పుల్లో గాయపడిన సైనికులను రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, యుద్ధరంగంలో ఆమె చేసిన సేవలకు గాను శౌర్య వీర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

First published:

Tags: Bollywood, Janvi Kapoor, Sridevi

ఉత్తమ కథలు