న్యూయార్క్‌లో తండ్రితో జాన్వీ కపూర్.. కూతుళ్లతో ఆనందంగా బోనీ కపూర్..

జాన్వీ కపూర్, బోనీ కపూర్ (Photo: janhvikapoor/Instagram)

వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ, శ్రీదేవి గారలపట్టి జాన్వీ కపూర్ న్యూయార్క్ వీధుల్లో హల్‌చల్ చేస్తోంది. తండ్రి బోనీ కపూర్, చెల్లి ఖుషీ కపూర్‌‌ను కలిసిన ఈ బ్యూటీ.. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.

 • Share this:
  వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ, శ్రీదేవి గారలపట్టి జాన్వీ కపూర్ న్యూయార్క్ వీధుల్లో హల్‌చల్ చేస్తోంది. తండ్రి బోనీ కపూర్, చెల్లి ఖుషీ కపూర్‌‌ను కలిసిన ఈ బ్యూటీ.. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. వివరాల్లోకెళితే.. ఇప్పటికే జాన్వీ సినిమాలతో బిజీగా ఉండగా, ఖుషీ కపూర్ కూడా వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. అయితే, నటనపై శిక్షణ తీసుకునేందుకు ఈ నెల 10 తండ్రితో కలిసి న్యూయార్క్ వెళ్లింది. వారిద్దరు అక్కడే ఉండగా, జాన్వీ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. దీంతో రెండు వారాల తర్వాత షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కేసింది.   
  View this post on Instagram
   

  Finally 🌈


  A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

  తండ్రి, చెల్లిని కలిసిన ఆనందంలో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక ఫోటోలో తండ్రి భుజంపై వాలినట్లు, ఇంకోటి చెల్లి ఖుషీ కపూర్‌తో సెల్ఫీ తీసుకున్న ఫోటోను పోస్ట్ చేసింది.   
  View this post on Instagram
   

  Finally 🌈


  A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

  ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అభిమానులు క్యూట్ ఫాదర్, డాటర్.. అని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా, జాన్వీ నటిస్తున్న కార్గిల్ గర్ల్ 2020లో విడుదల కానుంది. చేతి నిండా సినిమాలతో జాన్వీ బిజీగా ఉంది. ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ, భిన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. తన అందం, అభినయంతో యంగ్ హీరోయిన్లకు సవాల్ విసురుతోంది.   
  View this post on Instagram
   

  Fur is faux but our love isn’t 💕 #prayingfornyc


  A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on
  Published by:Shravan Kumar Bommakanti
  First published: