జాన్వీకపూర్ ఇప్పుడు బాలీవుడ్లో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తొలి సినిమాతోనే దుమ్ము దులిపేసింది ఈ ముద్దుగుమ్మ. ‘ధడక్’ సినిమా తర్వాత ఈమె కోసం బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. క సోషల్ మీడియాలో ఇప్పుడు ఈమె చేసిన డాన్స్ వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తుంది.
జాన్వీకపూర్ ఇప్పుడు బాలీవుడ్లో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తొలి సినిమాతోనే దుమ్ము దులిపేసింది ఈ ముద్దుగుమ్మ. ‘ధడక్’ సినిమా తర్వాత ఈమె కోసం బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఇప్పుడు మాత్రం సొంతంగానే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు ఈమె చేసిన డాన్స్ వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తుంది.
అచ్చంగా తల్లి శ్రీదేవిని గుర్తు చేసేలా ఉన్న ఈ వీడియో అదిరిపోయింది అంతే. ముఖ్యంగా ఆమె చేసిన మూవెంట్స్ అప్పట్లో శ్రీదేవి చేసిన డాన్సులను గుర్తు చేస్తున్నాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో విడుదలైంది. ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. సాధారణంగానే జాన్వీకపూర్ మంచి నటి మాత్రమే కాదు డాన్సర్ కూడా. ఆ విషయం ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. జాన్వీ డాన్స్ చూసి ఫ్యాన్స్ కూడా షేర్ల మీద షేర్లు చేసుకుంటున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.