sridevi: మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహంగా కొలువైన శ్రీదేవి..

శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ ప్రోగ్రామ్‌లోబోని కపూర్, జాన్వీ,ఖుషీ (twitter/Photo)

  • Share this:
    అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు శ్రీదేవి మైనపు విగ్రహాన్నిసింగపూర్‌లోని మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ రోజు శ్రీదేవి కుటుంబ సభ్యులైన ఆమె భర్త, కూతుళ్ల సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. భారతీయ సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూతురు జాన్వీ కపూర్..తల్లి మైనపు విగ్రహం చూసి కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు.

    తల్లి మైనపు విగ్రహం వద్ద జాన్వీ కపూర్ భావోద్వేగం (twitter/Photo)


    ఈ మైనపు విగ్రహాన్ని శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా’లోని హవా హవాయి పాటలో వేసుకన్న బంగారు వర్ణపు దుస్తులతో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీదేవి గత యేడాది ఫిబ్రవరి 24న దుబాయిలోని అనుమానాస్పదంగా చనిపోయిన సంగతి తెలిసిందే కదా. గతంలో మధుబాల మైనపు విగ్రహాన్ని చనిపోయిన తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు. తాజాగా చనిపోయిన తర్వాత శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం.

    sridevis wax statue to be unveiled at madame tussauds singapore here are the details,sridevi,Madame Tussauds,museum,sridevi boney kapoor,bollywood,wax figure,Tollywood, Latest,News, movies,amitabh,aishwarya rai,shahrukh khan,madhuri dixit,boney kapoor,shahid kapoor,shahid kapoor wax statue,madame tussauds,shahid kapoor wax statue at madame tussauds museum,madame tussauds museum,shahid kapoor madame tussauds,shahid kapoor to get waxed at madame tussauds,shahid kapoor’s wax statue at madame tussauds,madame tussauds london,shahid kapoor to get a wax statue at madame tussauds,shahid wax statue at madame tussads,shahid kapoor movies,Shahid kapoor instagram,shahid kapoor twitter,bollywood,hindi cinema,Jabardasth comedy show,kabir singh,kabir singh release date,మైనపు బొమ్మగా కొలువైన షాహిద్ కపూర్,షాహిద్ కపూర్ మైనపు బొమ్మ,మేడమ్ టుస్సాడ్స్‌ లో షాహిద్ కపూర్ మైనపు బొమ్మ,బాలీవుడ్ అర్జున్ రెడ్డి,కబీర్ సింగ్ రిలీజ్ డేట్,మేడం టుస్సాడ్స్,శ్రీదేవి,శ్రీదేవి బోనీ కపూర్,మైనపు బొమ్మ,టాలీవుడ్,బాలీవుడ్,అమితాబ్,ఐశ్వర్య రాయ్, షారుక్ ఖాన్,మాధురి దీక్షిత్,
    శ్రీదేవి మైనపు విగ్రహం (Twitter/Photo)


    కాగా, గ‌తంలో బాలీవుడ్ నుంచి అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్, సల్మాన్ మాధురి దీక్షిత్ ఇలా చాలా మంది మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసారు. ఇటీవ‌లే టాలీవుడ్‌ నుంచి మహేష్, ప్రభాస్ మైన‌పు బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు.

     
    First published: