జాన్వీ కపూర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంజన్ సక్సేనా’ ది కార్లిల్ గర్ల్ అనే సినిమా చేసింది. ఎయిర్ ఫోర్స్లో తొలి మహిళా అధికారిగా పనిచేసి 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ధీర వనిత గుంజన్ సక్సేనా నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా ఆడది అబలా కాదు.. సబలా అని చాటే చెప్పే సినిమా. అప్పటికే అన్ని రంగాల్లో ఆడవాళ్లు ముందుండి నడిపిస్తున్నారు. కానీ డిఫెన్స్ రంగంలో మాత్రం ఇప్పటికీ ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. అదే విషయాన్ని సినిమాలో చూపించారు. ముఖ్యంగా గుంజన్ సక్సేనా పైలెట్ కావాలని చెబితే.. ఇంట్లో వాళ్లు మొదట వద్దని వారిస్తారు. అది మగవాళ్లు చేసే ఉద్యోగం అంటూ. కానీ చివరకు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎయిర్ ఫోర్స్ అధికారిణి అవుతుంది. ఎయిర్ ఫోర్స్ అధికారిణిగా ఆమెకు తన పై అధికారులైన పురుషుల నుంచి సరైన మద్ధతు లభించదు. ముఖ్యంగా ఆమె ట్రైనింగ్ తీసుకునే చోట ఆడవాళ్లకు కనీసం ప్రత్యేక బాత్రూం సౌకర్యం కూడా ఉండదు. ముఖ్యంగా ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ తీసుకున్నట్టు కనబడుతుంది. వాళ్ల లాగే ఈ సినిమా కోసం బాగానే కష్టపడింది. జాన్వీ కష్టం సినిమాలో కనిపిస్తోంది. ఇక కార్గిల్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడే ఎయిర్ఫోర్స్ అధికారిణిగా ఎలా గుంజన్ తనను తాను మలుచుకున్నదే ఈ స్టోరీ. అదే ట్రైలర్లో ఆవిష్కరించారు.
లేడీ ఓరియంటెడ్ మూవీ ‘గుంజన్ సక్సెేనా’ ‘ది కార్గిల్ గర్ల్ మూవీని ఈనెల 12న పంద్రాగష్టు కానుకగా నెట్ఫ్లిక్స్లో విడుదల చేయనున్నారు. గుంజన్ సక్సేనా ఫస్ట్ ఉమెన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. అంతేకాదు యుద్దంలో పాల్గొన్న తొలి వనిత. ఈ చిత్రాన్ని శరణ్ శర్మ డైరెక్ట్ చేసారు. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Janhvi Kapoor, Netflix