• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • JANHVI KAPOOR GETS EMOTIONAL ON MOTHERS DAY AND SHARED A MEMORABLE PIC WITH HER MOTHER SRIDEVI PK

అమ్మా.. నువ్వు లేకుండా మ‌ద‌ర్స్ డే.. జాన్వీ కపూర్ ఎమోష‌న‌ల్ ట్వీట్..

జాన్వీ కపూర్ శ్రీదేవి

మ‌ద‌ర్స్ డే రోజు సెల‌బ్రెటీస్ అంతా త‌మ త‌మ మాతృమూర్తుల‌తో ఉన్న ఫోటోల‌ను.. వాళ్ల‌తో ఉన్న అనుబంధాల‌ను గుర్తు చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా కూడా అమ్మ గురించి అంతా పొగిడేస్తున్నారు.

  • Share this:
మ‌ద‌ర్స్ డే రోజు సెల‌బ్రెటీస్ అంతా త‌మ త‌మ మాతృమూర్తుల‌తో ఉన్న ఫోటోల‌ను.. వాళ్ల‌తో ఉన్న అనుబంధాల‌ను గుర్తు చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా కూడా అమ్మ గురించి అంతా పొగిడేస్తున్నారు. వాళ్ల ప్రేమ‌ను చూపించుకుంటున్నారు. ఇక జాన్వీ క‌పూర్ కూడా ఈ లోకంలో లేని తన అమ్మ‌ను త‌లుచుకుంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. శ్రీ‌దేవి ఉన్న‌పుడు త‌ల్లి చాటు బిడ్డ‌లాగే పెరిగింది జాన్వీ. కానీ ఆమె ఉన్న‌ట్లుండి క‌న్నుమూయ‌డంతో ప్ర‌పంచం ముందుకు వ‌చ్చింది జాన్వీ క‌పూర్. ఆమె లేని ఈ లోకంలో అమ్మ‌ను త‌లుచుకుంటూ ప్ర‌తీ రోజూ త‌న జ్ఞాప‌కాల‌ను పంచుకుంటూనే ఉంది.

ఇక తాజాగా మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా అమ్మ శ్రీ‌దేవితో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి.. వాళ్ల మాట వినండి.. వాళ్ల‌ను గౌర‌వించండి.. వాళ్లు చెప్పింది చేయండి అంటూ రాసుకొచ్చింది జాన్వీ. అమ్మ‌ల‌ను గౌర‌వించ‌డం నేర్చుకోండంటూ అమ్మ‌తో త‌నుకున్న బంధాన్ని గుర్తు చేసుకుంది జాన్వీ క‌పూర్. ఈమె ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. ధడక్ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్.. శ్రీదేవి కోరుకున్నట్లుగానే స్టార్ హీరోయిన్ కావాలని ఆరాటపడుతుంది. దాని కోసమే కష్టపడుతుంది కూడా.
First published: