ప్రముఖ సినీనటి శ్రీదేవి కుమార్తెలు జాన్వీకపూర్, ఖుషికపూర్ తమ స్నేహితులతో కలిసి అలిపిరి మార్గంలో కాలినడకన రాత్రి 11 గంటల సమయంలో తిరుమల చేరుకున్నారు. చివరి మెట్టు వద్ద కర్పూరం వెలిగించి మొక్కులు చెల్లించుకుని, అనంతరం పద్మావతినగర్లోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహంలో బసచేశారు. సోమవారం ఉదయం ప్రారంభ సమయంలో వీరు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైంస్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Janhvi Kapoor