JANHVI KAPOOR EMOTIONAL POST ABOUT HER MOTHER SRIDEVI ON DEATH ANNIVERSARY PK
శ్రీదేవి గురించి జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్.. ఫ్యాన్స్ కంటతడి..
శ్రీదేవి జాన్వీ కపూర్ (ఫైల్)
శ్రీదేవి చనిపోయి అప్పుడే ఏడాది అయిపోయింది. ఫిబ్రవరి 24 ఆమె వర్ధంతి. ఈ సందర్భంగా ఈ లోకంలో లేని అమ్మను తలుచుకుంది జాన్వీ కపూర్. అప్పట్లో బంధువుల పెళ్లికి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. అక్కడే అనుకోకుండా బాత్ టబ్బులో పడి చనిపోయింది.
శ్రీదేవి చనిపోయి అప్పుడే ఏడాది అయిపోయింది. ఫిబ్రవరి 24 ఆమె వర్ధంతి. ఈ సందర్భంగా ఈ లోకంలో లేని అమ్మను తలుచుకుంది జాన్వీ కపూర్. అప్పట్లో బంధువుల పెళ్లికి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. అక్కడే అనుకోకుండా బాత్ టబ్బులో పడి చనిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అమ్మ గురించి కంటతడి పెట్టించే పోస్ట్ పెట్టింది జాన్వీ. శ్రీదేవి ఉన్నపుడు జాన్వీ కపూర్ రాణిలా బతికింది. ప్రతీ చిన్న విషయానికి తల్లి చాటు బిడ్డలాగే ఉంది ఈ భామ. కానీ ఆ తర్వాత మాత్రం జాన్వీలో చాలా మెచ్యూరిటీ వచ్చింది.
ప్రతీ నిర్ణయాన్ని సొంతంగా తీసుకుంటుంది. ఇక ఇప్పుడు ఓ పోస్ట్ పెట్టి అందర్ని ఎమోషనల్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటో పోస్ట్ చేసి.. దానికింద ఇలా రాసుకొచ్చింది జాన్వీ. నా హృదయం ఎప్పుడూ భారంగానే ఉంటుంది.. కానీ నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను.. ఎందుకంటే ఆ నువ్వులోనే నువ్వున్నావ్ కదా అమ్మా అంటూ తన తల్లి చేయి పట్టుకున్న ఫొటోను ఫ్యాన్స్ కు షేర్ చేసింది జాన్వీ. ఇది చూసి నిజంగానే అంతా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.