హోమ్ /వార్తలు /సినిమా /

ఈమె కూడా ఉర్ఫి జావెద్ చెల్లెలే.. ప్రముఖ హీరోయిన్ పై నెటిజన్స్ సెటైర్లు

ఈమె కూడా ఉర్ఫి జావెద్ చెల్లెలే.. ప్రముఖ హీరోయిన్ పై నెటిజన్స్ సెటైర్లు

జాన్వికపూర్

జాన్వికపూర్

జాన్వీ కపూర్ డ్రెస్సింగ్ పై కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం  ఆమె బట్టలపై విమర్శలతో దాడి చేస్తున్నారు.

ఈ మధ్యన కొందరు హీరోయిన్లు డ్రెస్సులపై నెటిజన్స్ భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియా(Social Media)లో కొంతమంది సెలబ్రిటీలు పెడుతున్న పోస్టులపై జనం భయంకరంగా కామెంట్లు పెడుతున్నారు. వారికి ఏం అనిపిస్తే అదే చెప్పేస్తున్నారు. దీంతో పలువరు సెలబ్రిటీలోకు సోషల్ మీడియాలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి, చాలామంది ట్రోలింగ్ భరించలేక... సోషల్ మీడియాకు కూడా దూరమవుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) డ్రెస్సింగ్ విషయంలో కూడా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతుంటారు.

రోజూ ఆమె జిమ్‌కు వెళ్లే సమయంలో.. ఆమె ఫోటోలు,వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. ఇక ఈ వీడియోలు చూసిన అభిమానులు.... జాన్వీ కపూర్(Janhvi kapoor) డ్రెస్సింగ్ పై కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం  ఆమె బట్టలపై విమర్శలతో దాడి చేస్తున్నారు. ఇక తాజాగా సండే రోజున జాన్వీ వేసుకున్న జిమ్ డ్రెస్సుపై నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఓ నెటిజన్ ఈమెకు కొంచెం కూడా సిగ్గులేదా.. ఆ డ్రెస్సింగ్ ఏంటి అని.. ప్రశ్నిస్తే.. మరో నెటిజన్ ఈమె కూడా ఉర్ఫీ జావెద్(Urfi Javed) సోదరియే అంటూ సెటైర్లు వేశాడు.


ఇక ఉర్ఫీ జావెద్(Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉర్ఫీ డ్రెస్ వేసుకుంటే దానిపై ట్రోలింగ్ ఖాయం. ఆమె డ్రెస్ చూస్తే.. జనం మండిపడుతుంటారు. హిందీ బిగ్‌బాస్(Bigg Boss)  ఓటీటీ కంటెస్టెంట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నఈ భామ రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.ఇటీవలే ఈ భామ తన డ్రెస్సింగ్‌ను సమంతతో పోల్చుకుంటూ.. ఆమె వేస్తే తప్పులేదు.. నేను వేసుకుంటే తప్పా అంటూ.. సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది.

ఆ హీరోయిన్ పక్కన నిలబడాలంటేనే సెలబ్రిటీలకు ఇబ్బంది... అవును నిజమే !

ఇక హిందీ(Hindi) సీరియ‌ల్ న‌టి ఉర్ఫి జావెద్ గురించి సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్‌కు కొత్త‌గా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఫ్యాష‌న్ పేరు చెప్పి వింత వింత దుస్తుల‌తో ఈమె నెట్టింట హ‌ల్ చల్ చేసే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఉర్ఫి జావెద్ దుస్తుల‌ను చూసి కొంద‌రు మెచ్చుకుంటుంటే మరి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆమె బట్టలపై దారుణమైన కామెంట్లు చేస్తుంటారు. అలాంటి ఉర్ఫీతో ఇప్పుడు నెటిజన్  జన్వీకపూర్‌ను పోల్చడం బాలీవుడ్‌(Bollywood)లో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై జాన్వీ ఎలా స్పందిస్తుందో చూాడాలి.

First published:

Tags: Bollywood, Janhvi Kapoor

ఉత్తమ కథలు