Janhvi Kapoor : జాన్వీ కపూర్.. అందాల తార శ్రీదేవి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. జాన్వీ తొలి చిత్రం ‘ధడక్’లో మంచి నటనతో అదరగొట్టి.. ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. మరాఠిలో సూపర్ హిట్ అయిన 'సైరాత్'కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించారు. ఆ తర్వాత జాన్వీ ప్రస్తుతం ‘కార్గిల్ గాళ్', 'రుహీ అఫ్జా', 'తక్త్’ ‘దోస్తానా2’ సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాగా ఆ మధ్య జాన్వీ సౌత్‌లో నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ బ్యూటీని టాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసుకున్నారని టాక్ వినపడింది. అంతేకాదు విజయ్‌తో జాన్వీ నటిస్తుందని చెప్పారు. అయితే అలాంటీ వార్తలన్నీ మటాష్ అయ్యి విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటిస్తుందని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. దీంతో మరోసారి జాన్వీ సౌత్ ఎంట్రీ ఉత్తదైంది.
అది అలా ఉంటే.. తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను జాన్వీ కపూర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. జాన్వీ అద్దం ముందు నిలబడి హిందీ సినిమా 'గైడ్'లో పాపులర్ సాంగ్ 'పియా తోసే నైనా లాగిరే' పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. పాత హిందీ పాటకు ఆమె వయ్యారంగా పాదం కలుపుతూ చేసిన డ్యాన్స్‌ను అభిమానులు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Janhvi Kapoor